హోండా మొబిలియో 5800 బుకింగ్స్
హోండా కార్స్ ఇండియా భారత మార్కెట్లో విడుదల చేసిన తమ మొట్టమొదటి ఎమ్‌పివి (మల్టీ పర్సస్ వెహికల్) 'హోండా మొబిలియో' (Honda Mobilio) హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. కేవలం రూ.6.49 లక్షల (పెట్రోల్ వెర్షన్, ఎక్స్-షోరూమ్. ఢిల్లీ) ప్రారంభ ధరకే విడుదలైన ఈ ఎమ్‌పివి డీజిల్ వెర్షన్‌లో కూడా లభ్యమవుతుండటంతో కొనుగోలుదారులు ఈ మోడల్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు.
హోండా మొబిలియోకి ఇప్పటి వరకు 5,800 ఆర్డర్లు వచ్చినట్లు సమాచారం. జులై 8వ తేదీ నుంచే హోండా తమ మొబిలియో కోసం ప్రీ బుకింగ్స్‌ను స్వీకరించడం ప్రారంభించిన సంగతి తెలిసినదే. ఈ ట్రెండ్ చూస్తుంటే, హోండా మొబిలియో వెయిటింగ్ పీరియడ్ ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇక మొబిలియో విషయానికి వస్తే.. పెద్ద కుటుంబాలను టార్గెట్ చేసుకొని హోండా ప్రవేశపెట్టిన ఈ ఫ్యామిలీ కారులో 7 సీట్లు (2+3+2) ఉంటాయి. ఇది పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్‌లో లభిస్తుంది. హోండా కార్స్ ఇండియాకు భారత్‌లో ఇది మూడవ డీజిల్ కారు.

పెట్రోల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-విటెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-డిటెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. హోండా మొబిలియో డీజిల్ లీటరుకు 24.2 కిలోమీటర్ల మైలేజీని మరియు పెట్రోల్ వెర్షన్ లీటరుకు 17.3 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.
హోండా మొబిలియోలో స్టయిలిష్ స్పోర్టీ వేరియంట్‌ను కోరుకునే వారి కోసం కంపెనీ ఇందులో మొబిలియో ఆర్ఎస్ పేరిట ఓ కొత్త వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఈ వేరియంట్‌లో ప్రొజెక్టర్ ల్యాంప్స్, ఎల్ఈడి పొజిషనింగ్ ల్యాంప్స్ వంటి ప్రీమియం ఫీచర్లుంటాయి. ఇదికేవలం డీజిల్ వెర్షన్లో మాత్రమే లభ్యం కానుంది. అయితే, ఇది అందుబాటులోకి రావటానికి మరో 3 నెలల సమయం పడుతుంది. సెప్టెంబర్ 2014 నుంచి ఈ స్పోర్టీ వెర్షన్ మొబిలియో డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. మొబిలియో వేరియంట్లు ధరలు, ఇలా ఉన్నాయి:
పెట్రోల్ వెర్షన్ ధరలు
హోండా మొబిలియో ఈ - రూ.6.49 లక్షలు
హోండా మొబిలియో ఎస్ - రూ.7.50 లక్షలు
హోండా మొబిలియో వి - రూ.8.76 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
డీజిల్ వెర్షన్ ధరలు
హోండా మొబిలియో ఈ - రూ.7.89 లక్షలు
హోండా మొబిలియో ఎస్ - రూ.8.60 లక్షలు
హోండా మొబిలియో వి - రూ.9.76 లక్షలు
హోండా మొబిలియో ఆర్ఎస్ - రూ.10.86 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








