జులై 23న హోండా మొబిలియో విడుదల, మరో కొత్త టివిసి
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ నుంచి ఎంతగానో ఎదురుచూస్తున్న 'హోండా మొబిలియో' (Honda Mobilio) ఎమ్‌పివి ఈనెల 23వ తేదీన భారత మార్కెట్లో విడుదల కానుంది. మొబిలియోకు ప్రజాదరణ కల్పించేందుకు గాను కంపెనీ ఇప్పటికే ఈ మోడల్‌ను దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న ప్రముఖ షాపింగ్ మాల్స్‌లో ప్రజల సందర్శనార్థం ప్రదర్శనకు ఉంచుతోంది.
హోండా ఇప్పటికే ఈ మోడల్‌కు సంబంధించి ప్రముఖ టెలివిజన్ కమెడియన్ కపిల్ శర్మతో రూపొందించిన ఓ టెలివిజన్ కమర్షియల్‌ను కూడా రూపొందించిందిన సంగతి తెలిసినదే. కాగా.. కపిల్ శర్మపై రూపొందించిన మరో కామెడీ కమర్షియల్‌ను తాజాగా హోండా తమ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసింది. ఈ కమర్షియలో కూడా కపిల్ తనదైన శైలిలో హాస్యాన్ని పండిస్తూ, హోండా మొబిలియో ఎమ్‌పివిలోని ఫీచర్లను కూడా వివరించాడు.
ఆ హాస్యభరిత వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/Fzzj5MshwCk?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>
హోండా మొబిలియో విషయానికి వస్తే, ఇదొక 7-సీటర్ (2+3+2) ఎమ్‌పివి. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-విటెక్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6600 ఆర్‌పిఎమ్ వద్ద 117 బిహెచ్‌పిల శక్తిని, 4600 ఆర్‌పిఎమ్ వద్ద 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ వెర్షన్ అందుబాటులో లేదు.
ఇకపోతే.. డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-డిటెక్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3600 ఆర్‌పిఎమ్ వద్ద 98 బిహెచ్‌పిల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే లభిస్తుంది. ఇందులో కూడా ఆటోమేటిక్ వెర్షన్ అందుబాటులో లేదు. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర రూ.5.90 లక్షలు ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.



Click it and Unblock the Notifications








