హోండా మొబిలియో ఎమ్‌పివి విడుదల ఎప్పుడు?
By Ravi
జపనీస్ కార్ కంపెనీ హోండా గడచిన కొద్ది నెలల క్రితం ఆవిష్కరించిన మొబిలియో ఎమ్‌పివి విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హోండా మొబిలియో ఎమ్‌పివి కోసం కంపెనీ ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా రూపొందించింది. అంతేకాకుండా, మరికొద్ది నెల్లోనే విడుదల చేస్తామంటూ ఓ టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది.
హోండా మొబిలియో వెబ్‌సైట్‌లో ఆ ఎమ్‌పివికి సంబంధించి ఎక్స్టీరియర్, ఇంటీరియర్ వివరాలతో పాటుగా ఓ డెమో వీడియోను అందుబాటులో ఉంచారు. గ్రేటర్ నోయిడాలోని హోండా కార్ ప్లాంట్ మరో రెండు మూడు వారాల్లో మొబిలియో ఉత్పత్తి ప్రారంభం కానుంది. పండుగ సీజన్ ప్రారంభం కాగానే ఈ కొత్త హోండా ఎమ్‌పివి వినియోగదారులుక అందుబాటులోకి రానుంది.
Honda Mobilio Previewed On Website
హోండా మొబిలియో 7-సీటర్ ఆప్షన్‌తో ఈ సెగ్మెంట్లో నేరుగా మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివికి పోటీగా నిలువనుంది. మొబిలియోను బ్రయో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు కాబట్టి, దీనిని ముందు వైపు నుంచి చూస్తే ఇది బ్రయో మాదిరిగానే అనిపిస్తుంది. ప్రస్తుతం కొత్త తరం హోండా సిటీ సెడాన్‌లో ఉపయోగిస్తున్న పెట్రోల్, డీజిల్ ఇంజన్లనే ఈ కొత్త మొబిలియోలోను ఉపయోగించనున్నారు.
పెట్రోల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-విటెక్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 116 బిహెచ్‌పిల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-డిటెక్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 97 బిహెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ.5.90 లక్షలు ఉండొచ్చని అంచనా.
Post by DriveSpark.
More from DriveSpark
Article Published On: Tuesday, April 15, 2014, 17:12 [IST]
English summary
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+