హోండా మొబిలియో దట్స్ మై రైడ్ టివిసి
హోండా కార్స్ ఇండియా తాజాగా మార్కెట్లో విడుదల చేసిన తమ మొట్టమొదటి ఎమ్‌పివి 'మొబిలియో' కోసం కంపెనీ మరో సరికొత్త టెలివిజన్ కమర్షియల్‌ను రూపొందించింది. ఈ కమర్షియల్ ద్వారా హోండా తమ మొబిలియో యొక్క విశిష్టతలను హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. ఓ పెద్ద ఫ్యామిలీ యో యో స్టైల్‌లో 'దట్స్ మై రైడ్.. దట్స్ మై రైడ్..' అంటూ ఈ ఎమ్‌పివిలో తాము ఏమేం చేయగలమో వివరిస్తుంటారు. మరి మనం కూడా ఆ వీడియోని చూసేద్దాం రండి.
ఇది కూడా చదవండి: హోండా మొబిలియో వేరియంట్లు, ధరలు
ఇక హోండా మొబిలియో విషయానికి వస్తే.. ఎమ్‌పివి సెగ్మెంట్లో మారుతి ఎర్టిగా వంటి ఎమ్‌పివి మోడళ్లకు గట్టి పోటీనిచ్చేలా హోండా కార్స్ ఇండియా ప్రవేశపెట్టిన ఈ లేటెస్ట్ ఎమ్‌పివి పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లలో లభిస్తుంది. ఇది హోండా నుంచి లభ్యం కానున్న 3వ డీజిల్ కారు (మొదటిది అమేజ్, రెండవది సిటీ) కారు కావటం విశేషం.
పెట్రోల్ వెర్షన్ మొబిలియోలో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-విటెక్, 119 పిఎస్, 145 ఎన్ఎమ్ టార్క్ ఇంజన్‌ను ఉపయోగించారు. అలాగే, డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-డిటెక్ 98 బిహెచ్‌పి, 200 ఎన్ఎమ్ టార్క్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ రెండు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. డీజిల్ వెర్షన్ లీటరుకు 24.2 కి.మీ., పెట్రోల్ వెర్షన్ లీటరుకు 17.3 కి.మీ. మైలేజీనిస్తుంది.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/DyGHqA8bVfg?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








