హోండా మొబిలియో కొత్త డిటేల్స్, కొత్త ఫొటోస్

By Ravi

జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా జూలై 2014లో తమ మొబిలియో ఎమ్‌పివిని మార్కెట్లో విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇండియన్ వెర్షన్ హోండా మొబిలియో ఫొటోలను, కొన్ని వివరాలను వెల్లడి చేసింది. ఆ వివరాలంటే ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

హోండా మొబిలియోను 6-సీటర్ (2+2+2), 7-సీటర్ (2+3+2) కాన్ఫిగరేషన్లతో ఆఫర్ చేయనున్నారు. అదనపు లగేజ్ కోసం రెండు, మూడు వరుసలలోని సీట్లను పూర్తిగా ముందు వైపుకు మడుచుకునే సౌకర్యం ఉంటుంది.


ఇంజన్స్ విషయానికి వస్తే.. హోండా మొబిలియో ఎమ్‌పివి ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కొత్త తరం హోండా సిటీ సెడాన్ మాదిరిగానే పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. వాస్తవానికి సిటీలో ఉపయోగించిన ఇంజన్లనే ఈ కొత్త హోండా మొబిలియోలోను ఉపయోగించనున్నారు.

పెట్రోల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-విటెక్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6600 ఆర్‌పిఎమ్ వద్ద 117 బిహెచ్‌పిల శక్తిని, 4600 ఆర్‌పిఎమ్ వద్ద 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ వెర్షన్ అందుబాటులో లేదు.

Honda Mobilio Website Updated

ఇకపోతే.. డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-డిటెక్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3600 ఆర్‌పిఎమ్ వద్ద 98 బిహెచ్‌పిల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే లభిస్తుంది. ఇందులో కూడా ఆటోమేటిక్ వెర్షన్ అందుబాటులో లేదు.

హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన హోండా మొబిలియో ఎమ్‌పివిని తొలిసారిగా గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించింది. ఈ మోడల్‌ను గ్రేటర్ నోయిడాలోని హోండా ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర రూ.5.90 లక్షలు ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, June 17, 2014, 15:46 [IST]
English summary
Honda has updated its website for India with new images of the Mobilio MPV ahead of its scheduled launch in July. The website shows two images of the top spec diesel variant of the Mobilio and provides 360 degree view of the interior.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+