ఫిబ్రవరిలో 123 శాతం పెరిగిన హోండా కార్స్ ఇండియా సేల్స్
భారత ఆటోమొబైల్ మార్కెట్లో గడచిన నెలలో మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి అగ్రగామి కార్ కంపెనీల అమ్మకాలు తగ్గుముఖం పడితే, హోండా కార్స్ ఇండియా అమ్మకాలు మాత్రం ఏకంగా 123 శాతం పెరిగాయి. ఫిబ్రవరి 2013 నెలతో పోల్చుకుంటే, ఫిబ్రవరి 2013లో కంపెనీ అమ్మకాలు 100 శాతనికి పైగా పెరిగాయి.
ఇది కూడా చదవండి: హోండా సిటీ 2014 టెస్ట్ డ్రైవ్ రివ్యూ
హోండా ఇటీవల విడుదల చేసిన సిటీ మిడ్-సైజ్ సెడాన్ మరియు అమేజ్ కాంపాక్ట్ సెడాన్లు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం అవుతుండటంతో కంపెనీ అమ్మకాలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 2014లో హోండా కార్స్ ఇండియా మొత్తం 15,543 వాహనాలను విక్రయించింది. ఇందులో 7213 యూనిట్ల సిటీ కార్లు ఉండగా, 6030 యూనిట్లు అమేజ్ కార్లు ఉన్నాయి. ఇదే సమయంలో కంపెనీ 1235 బ్రయో హ్యాచ్‌బ్యాక్‌లను, 65 సిఆర్-వి ఎస్‌యూవీలను విక్రయించగా, 252 వాహనాలను ఎగుమతి చేసింది.

అదే గడచిన సంవత్సరంతో పోల్చుకుంటే, ఫిబ్రవరి 2013లో హోండా మొత్తంగా 6510 వాహనాలను మాత్రమే విక్రయించింది. సరికొత్త హోండా సిటీ సెడాన్‌కు లభిస్తున్న స్పందన చూస్తుంటే, తమకెంతో సంతోషంగా ఉందని, ఇది మార్కెట్లోకి విడుదలైన మొదటి నెలలోనే తిరిగి తన లీడర్‌షిప్ స్థానాన్ని దక్కించుకుందని హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు.
ఏప్రిల్ 2013 నుంచి ఫిబ్రవరి 2014 నాటికి హోండా కార్స్ ఇండియా మొత్తం అమ్మకాలు అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోల్చుకుంటే 83 శాతం వృద్ధి చెంది 63,439 యూనిట్ల నుంచి 1,15,913 యూనిట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications








