రాజస్థాన్‌లో కొత్త హోండా కార్స్ ప్లాంట్ ప్రారంభం
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా, దేశీయ విపణిలో వేగం పుంజుకుంది. అమేజ్, సిటీ సెడాన్లతో డీజిల్ కార్ సెగ్మెంట్లోకి ప్రవేశించిన హోండా, ఇప్పుడు భారత మార్కెట్లో తమ ఉత్పత్తుల డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేసేందుకు రెండవ ప్లాంటును ప్రారంభించింది.
రాజస్థాన్‌లోని తపుకరా వద్ద ఏర్పాటు చేసిన హోండా కార్ ప్లాంటును కంపెనీ ఇటీవలే ప్రారంభించింది. హోండా కార్స్ ఇండియాకు ఇది భారత్‌లో రెండవ కార్ల ఉత్పత్తి కేంద్రం. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో కంపెనీ హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌ను ఉత్పత్తి చేస్తోంది.

దాదాపు 450 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ హోండా కార్ ప్లాంట్‌లో ఫోర్జింగ్ షాప్, ప్రెస్ షాప్, పవర్‌ట్రైన్ షాప్, వెల్డ్ షాప్, పెయింట్ షాప్, ప్లాస్టిక్ మౌల్టింగ్, ఇంజన్ అసెంబ్లీ, ఫ్రేమ్ అసెంబ్లీ మరియు ఇంజన్ టెస్టింగ్ వంటి సదుపాయాలున్నాయి.
హోండా తపుకరా ప్లాంట్ గురించి కొన్ని విషయాలు
* లొకేషన్ - తపుకరా ఇండస్ట్రియల్ ఏరియా, అల్వార్ డిస్ట్రిక్, రాజస్థాన్
* ఏరియా - 450 ఎకరాలు
* ఉత్పత్తి సామర్థ్యం - సాలీనా 1.20 లక్షల యూనిట్లు
* ఉద్యోగాలు - సుమారు 3200
* మొత్తం పెట్టుబడి - రూ.3526 కోట్లు
తపుకరా ప్లాంట్ ఏర్పాటుతో భారత్‌లో హోండా కార్స్ ఇండియా మొత్తం ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 2.40 లక్షల యూనిట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications








