బ్రయో కన్నా చిన్న కారుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: హోండా

By Ravi

భారత ఆటోమొబైల్ మార్కెట్లో రూ.3-4 లక్షల రేంజ్‌లో ఉన్న ఎంట్రీ లెవల్ కార్లకు మంచి గిరాకీ ఉన్న సంగతి తెలిసినదే. అయితే, జపనీస్ కార్ బ్రాండ్ హోండా మాత్రం ఈ సెగ్మెంట్ వైపు ఇప్పట్లో దృష్టి సారించబోమని చెబుతోంది. ప్రస్తుతం తాము దేశీయ విపణిలో విక్రయిస్తున్న బ్రయో హ్యాచ్‌బ్యాక్‌కు దిగువన చిన్న కారును ప్రవేశపెట్టడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని హోండా స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: 2014 ఫియట్ పుంటో ఇవో విడుదల

ఈ విభాగంలో ప్రవేశించాలా లేక వద్దా అనే విషయంపై కంపెనీ స్పష్టంగా లేదని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ వెల్లడించారు. ప్రస్తుతం హోండాకు ప్రపంచ వ్యాప్తంగా బ్రయోనే చిన్న కారు. కాగా.. భారత్ మరియు జపాన్‌లో ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బృందం మాత్రం చిన్న కారుపై అధ్యయనాలు చేస్తున్నాయి.

Honda Brio

భారత్‌లో కేవలం 2 శాతం మాత్రమే మార్కెట్ వాటా సాధించుకున్న బ్రయో, హోండా ఆశించిన రీతిలో అమ్ముడుపోవటం లేదు. ఈ నేపథ్యంలో, కంపెనీ కూడా ఈ మోడల్ అమ్మకాలను పెంచే విషయంలో పెద్దగా ఆసక్తి కనబరుస్తున్నట్లు లేదు. తాము ఇటీవలే విడుదల చేసిన మొబిలియో, సిటీ, అమేజ్ మోడళ్ల అమ్మకాలను పెంచడం దృష్టి సారించామని సేన్ తెలిపారు.

ఇది కూడా చదవండి: హోండా మొబిలియో ఆర్ఎస్ డిటేల్స్

గడచిన వారంలో విడుదలైన హోండా మొబిలియో ఇప్పటికే 10,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను దక్కించుకుంది. హోండా మొత్తం అమ్మకాలలో దాదాపు 40 శాతం అమ్మకాలు సిటీ, అమేజ్, మొబిలియో ద్వారానే వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. 2017 నాటికి హోండా కార్స్ ఇండియా దేశీయ విపణిలో మొత్తం 3 లక్షల వాహనాలను విక్రయించాలనే లక్ష్యంతో ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 7, 2014, 10:54 [IST]
English summary
Honda, the Japanese car maker has not yet decided about whether to introduce a smaller car than the Brio for the Indian market. Jnaneswar Sen, Honda Senior VP sales and marketing said that Honda is still unclear whether the company should enter or not into this category.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+