హ్యుందాయ్ బ్రెజిల్ ఫుట్‌బాల్ వీడియో కాంట్రోవర్సీ
కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ బ్రెజిల్‌లో ఓ కొత్త యాడ్-క్యాంపైన్‌ను ప్రారంభించింది. ఇప్పుడు ప్రకటన కాస్తా వివాదాస్పదంగా మారింది. ఈ ప్రకటనలో.. బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు వరుసుగా 6వ సారి కూడా వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంటే, బ్రెజిలియన్ కస్టమర్లకు హ్యుందాయ్ తమ కార్లపై అధనంగా 6 ఏళ్ల పాటు వారంటీని ఆఫర్ చేస్తామని ప్రకటించింది.
హ్యుందాయ్ ఆఫర్ బాగానే ఉన్నప్పటికీ, ఈ ప్రకటన ద్వారా కంపెనీ ఒక్క దేశాన్ని మాత్రమే సపోర్ట్ చేస్తుండటం, పైపెచ్చు ఇది బ్రెజిలియన్ సాకర్ ఫెడరేషన్ నిర్దేశించిన మార్గదర్శకాలకు విరుద్ధగా ఉండటంతో, హ్యుందాయ్ ఈ ప్రకటనను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది.

ఈ వీడియో పోర్చుగీసు భాషలో ఉంది, కానీ ఇందులోని ఆంగ్లపు సబ్‌టైటిల్స్ ఆధారంగా ఈ ప్రకటన సారాంశం వెల్లడవుతోంది. 'హెక్సా' అనే పదం ఆధారంగా చేసుకొని ఈ క్యాంపైన్ సాగుతుంది. ఇందులో హెక్సా అంటే, ఆంగ్లంలో ఆరు అని అర్థం.
ఈసారి బ్రెజిలియన్ బృందం వరల్డ్ కప్‌ను సాధిస్తే, చరిత్రలో ఇది వరుసగా ఆరవ సారి ప్రపంచ కప్‌ను సాధించినట్లు అవుతుంది. హ్యుందాయ్ ప్రస్తుతం బ్రెజిలియన్ కస్టమర్లకు తమ కార్లపై 5 ఏళ్ల వారంటీని ఆఫర్ చేస్తోంది. అయితే, ఈసారి కూడా బ్రెజిల్ బృందం వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంటే, తమ కార్లపై మరో ఏడాది అధనంగా మొత్తం ఆరేళ్ల పాటు వారంటీ అందిస్తామని ప్రకటించింది. ఆ వివాదాస్పద వీడియోని మనం కూడా వీక్షిద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/kdi8ay9Lld8?list=UUnBYf03jmMPiABvbSYbxMcA" frameborder="0" allowfullscreen></iframe>)</center>


Click it and Unblock the Notifications