కాంపాక్ట్ ఎస్‌యూవీ రేస్‌లో హ్యుందాయ్; 2015లో విడుదల

By Ravi

కాంపాక్ట్ ఎస్‌యూవీ రేస్‌లో పాల్గొనేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా సిద్ధమైంది. ఇప్పటికే భారత ఆటోమొబైల్ మార్కెట్లో మంచి వృద్ధిని కనబరుస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఓ సరికొత్త ఉత్పత్తి ప్రవేశపెట్టేందుకు హ్యుందాయ్ ప్రణాళిలు రచిస్తోంది.

హ్యుందాయ్ గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న ఐఎక్స్25 మోడల్‌ను ఆధారంగా చేసుకొని ఓ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ ఇండియాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త శాంటాఫే ఎస్‌యూవీలోని డిజైన్ క్యూస్ ఇందులోను గమనించవచ్చు.

హ్యుందాయ్ నుంచి అత్యంత పాపులర్ అయిన 'ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0' డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా చేసుకొని ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని డిజైన్ చేయనున్నారు. ఇది 4270 మి.మీ. పొడవును, 1780 మి.మీ. వెడల్పును, 1630 మి.మీ. ఎత్తుని, 2590 మి.మీ. వీల్‌బేస్‌ని కలిగి ఉంటుందని సమాచారం.

Hyundai ix25

హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 5-సీటర్ ఆప్షన్‌ను మాత్రమే కలిగి ఉంటుందని తెలుస్తోంది. గ్లోబల్ మార్కెట్లలో లభిస్తున్న హ్యుందాయ్ ఐఎక్స్25 మోడల్ 1.4 లీటర్ విటివిటి పెట్రోల్, 1.4 లీటర్ సిఆర్‌డిఐ డీజిల్ మరియు 1.6 లీటర్ సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం అవుతోంది.

హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ సెగ్మెంట్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్, నిస్సాన్ టెర్రానో వంటి మోడళ్లతో పోటీ పడనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, December 24, 2014, 13:40 [IST]
English summary
South Korean carmaker Hyundai has confirmed to enter the lucrative compact SUV segment in India. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+