యూట్యూబ్‌లో 10 లక్షలకు పైగా హిట్స్ దక్కించుకున్న ఎలైట్ ఐ20
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన ఎలైట్ ఐ20 కోసం కంపెనీ రూపొందించిన టెలివిజన్ కమర్షియల్ (టివిసి) వీడియో ఇంటర్నెట్లో రికార్డులు సృష్టిస్తోంది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన ఈ వీడియోని ఒక్క వారంలోపే ఇప్పటికే 10 లక్షల మంది వీక్షించారని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫుల్ ఫీచర్స్
హాలీవుడ్ స్పై థ్రిల్లర్ ఫీల్‌తో రూపొందించిన ఈ టివిసిని ఎలైట్ ఐ20 విడుదలైన రోజునే యూట్యూబ్‌లోను విడుదల చేశారు. ఈ టెలివిజన్ కమర్షియల్‌ను రోమానియా లొకేషన్లలో షూట్ చేశారు. హాలీవుడ్ తరహా ఫీట్లు, కార్ ఛేజ్‌లతో 100 సెకండ్ల నిడివితో ఈ కమర్షియల్ తయారు చేశారు. ఇందులో ఎలైట్ ఐ20 కారు పనితీరుని హైలైట్ చేశారు. ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.
హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విషయానికి వస్తే, ఇది మొత్తం 8 వేరియంట్లలో (4 పెట్రోల్, 4 డీజిల్) లభిస్తుంది. హ్యుందాయ్ 2008లో తమ మొదటి తరం (ఫస్ట్ జనరేషన్) ఐ20ని భారత మార్కెట్లో విడుదల చేసింది. కాగా.. తాజాగా హ్యుందాయ్ విడుదల చేసిన ఎలైట్ ఐ20 రెండవ తరానికి (సెకండర్ జనరేషన్) చెందినది. ఈ కారును ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా డిజైన్ చేశారు. యంగ్ మిడ్ లెవల్ ఎగ్జిక్యూటివ్‌లను టార్గెట్‌గా చేసుకొని హ్యుందాయ్ ఎలైట్ ఐ20ని ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/GqzvDXCRA2A" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








