గ్రామీణ మార్కెట్లలో కొత్త సెగ్మెంట్లపై కన్నేసి హ్యుందాయ్

By Ravi

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ, దక్షిణ కొరియాకు చెందిన ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో ప్యాసింజర్ కార్ మార్కెట్లో అధిక వాటాను దక్కించుకునేందుకు మారుతి సుజుకి ఇండియా మాదిరిగానే గ్రామీణ మార్కెట్లపై కన్నేసింది. గ్రామీణ ప్రాంతాలలో కార్లకు మంచి గిరాకీ ఏర్పడుతున్న నేపథ్యంలో, అక్కడి కస్టమర్లకు చేరువయ్యేందుకు ఆటోమొబైల్ కంపెనీ పల్లెబాట పడుతున్నాయి.

ఇది కూడా చదవండి: హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల, ధరలు, ఫీచర్లు

గ్రామీణ మార్కెట్లలో మారుతి సుజుకి ఇప్పటికే మంచి స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసినదే. హ్యుందాయ్ కూడా ఇదే బాటలో పయనించాలని నిర్ణయించుకుంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా మూడు, నాల్గవ తరగతి పట్టణాల్లో రూరల్ సేల్స్ ఔట్‌లెట్లను (ఆర్‌ఎస్‌వో) విస్తరిస్తోంది. హ్యుందాయ్‌కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 315 ఆర్‌ఎస్‌వోలు ఉన్నాయి.

Hyundai Eyes New Segments In Indian Rural Markets

హ్యుందాయ్ నిర్వహిస్తున్న ఆర్ఎస్‌వోలు విజయవంతం కావడంతో వ్యాపార అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో ఇలాంటివి మరిన్ని ఔట్‌లెట్లను ప్రారంభించాలని హ్యుందాయ్ నిర్ణయించుకుంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం అమ్మకాల్లో దాదాపు 10 శాతం వాటా ఈ ఆర్‌ఎస్‌వోల నుంచి వస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. వచ్చే 2014-15 నాటికి ఈ వాటాను 15 శాతానికి పెంచుకునే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది.

భారత ప్యాసింజర్ మార్కెట్లో తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు అలాగే కస్టమర్లకు నూతనత్వాన్ని పరిచయం చేసేందుకు గాను, భారత్‌లో ప్రతి ఏటా కనీసం రెండు మోడళ్లను పరిచయం చేయాలని కృతనిశ్చయంతో ఉన్నామని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటికే మూడు కొత్త మోడళ్లను విడుదల చేశామని, రానున్న రోజుల్లో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని మరింత విస్తరిస్తామని హ్యుందాయ్ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 14, 2014, 14:48 [IST]
English summary
Korean car major Hyundai is looking to tap new customers in rural areas and corporate segment to increase its market share in the Indian automobile market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+