హ్యుందాయ ఫ్రీ మాన్‌సూన్ కార్ చెకప్ క్యాంప్ షురూ..
వర్షాకాలం సమీపిస్తుండటంతో, తమ వినియోగదారుల వాహనాలను కండిషన్‌లో ఉంచేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఉచిత మాన్‌సూన్ చెకప్‌ను ప్రారంభించింది. హ్యుందాయ్ నిర్వహిస్తున్న ఈ ఉచిత మాన్‌సూన్ చెకప్ క్యాంప్‌లో భాగంగా, కంపెనీ తమ కార్లకు అదనపు మెయింటినెన్స్‌ను అందించనుంది. జూన్ 16వ తేదిన ప్రారంభమైన ఈ క్యాంపైన్ ఆగస్ట్ 30 వరకు కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ఈ హ్యుందాయ్ ఉచిత మాన్‌సూన్ చెకప్ క్యాంప్‌ను జులై 3, 2014వ తేది నుంచి జులై 13, 2014వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇరు రాష్ట్రాలలో ఉన్న అన్ని అధీకృత హ్యుందాయ్ డీలర్‌షిప్ కేంద్రాలు, సర్వీస్ సెంటర్ల వద్ద ఈ క్యాంప్ నిర్వహిస్తారు. ఈ క్యాంప్‌కు వచ్చే హ్యుందాయ్ వాహనాలకు 22-పాయింట్ ఫ్రీ చెకప్ ఉంటుంది.

ఈ క్యాంప్ సమయంలో హ్యుందాయ్ డీలర్‌షిప్‌ల వద్దకు తీసుకువచ్చే హ్యుందాయ్ కార్లలో బ్రేక్ ఫ్లూయిడ్ లైన్స్, టైర్ కండిషన్స్, వైపర్ ఆర్మ్స్, రబ్బర్ కండిషన్స్, పవర్ విండో ఆపరేషన్స్, సెంట్రల్ లాకింగ్ ఆపరేషన్స్, క్లచ్ అండ్ సస్పెన్షన్ మొదలైన అంశాలను ఉచితంగా చెక్ చేసి, ఏవైనా లోపాలు ఉంటే సరి చేస్తారు. ఏవైనా రీప్లేస్ చేయాల్సి వస్తే, వాటి గురించి కస్టమర్లకు తెలియజేస్తారు.
తమ విలువైన వినియోగదారులతో సంబంధ బాంధవ్యాలను మరింత పటిష్టం చేసుకునే దిశగా ఈ ఉచిత మాన్‌సూన్ చెకప్ క్యాంపైన్ ప్రణాళికను చేపట్టామని, వర్షాకాలంలో తమ వాహనాల సేఫ్టీని మరింత మెరుగు పరచే లక్ష్యంగా ఈ ప్రణాళిక ఉంటుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు.


Click it and Unblock the Notifications








