సరికొత్త అవతారంలో కనిపించనున్న 'హ్యుందాయ్ ఐ20'
కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 త్వరలోనే మరో సరికొత్త అవతారంలో కనిపించనుంది. మారుతున్న వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా, మరిన్ని ప్రీమియం ఫీచర్లు, సరికొత్త స్టయిలింగ్‌తో కూడిన అప్‌గ్రేడెడ్ హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ త్వరలోనే ప్రవేశపెట్టనుంది.
ఇప్పటికే హ్యుందాయ్ తమ ఫేస్‌లిఫ్ట్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ను చెన్నై రోడ్లపై (అక్కడి ప్లాంటులోనే ఇది ఉత్పత్తి కానుంది) టెస్టింగ్ చేస్తుండగా పలుసార్లు కమెరాకు చిక్కిన సందర్భాలున్నాయి. ఈ టెస్టింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే, త్వరలోనే ఈ సరికొత్త హ్యుందాయ్ ఐ20 మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ హ్యుందాయ్ ఐ20 కారులో 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 83 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుది. డీజిల్ వెర్షన్‌లో 1.4 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త ఇంజన్లు 5-స్పీడ్ లేదా 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేసే ఆస్కారం ఉంది.
కొత్త ఐ20 వీల్‌బేస్ ప్రస్తుత ఐ20 కొన్నా మరింత పొడవుగా ఉండనుంది. ఫలితంగా, ఈ కారులో మరింత విశాలమైన లెగ్‌రూమ్, క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. ఫలితంగా కారులోని ప్రయాణీకులు సౌకర్యంగా కూర్చునే వెసలుబాటు ఉంటుంది. ఇంకా రివైజ్డ్ ఫ్రంట్ గ్రిల్, బాడీ కిట్, స్పాయిలర్ వంటి మార్పులు ఇందులో ఉండే అవకాశం ఉంది. కొత్త హ్యుందాయ్ ఐ20 ఈ ఏడాది చివరికి కానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కానీ మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.
Don't Miss Facebook Video Of The Day


Click it and Unblock the Notifications








