హోండా జాజ్‌కు పోటీనిచ్చేందుకు వస్తున్న హ్యుందాయ్ ఐ30
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో జపనీస్ కార్ కంపెనీ హోండా త్వరలో ప్రవేశపెట్టనున్న సరికొత్త 2014 జాజ్ హ్యాచ్‌బ్యాక్ పోటీనిచ్చేందుకు కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభిస్తోంది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ఐ20 హ్యాచ్‌బ్యాక్ ఎగువన ఓ ప్రీమియం హ్యాచ్‍బ్యాక్‌ను ప్రవేశపెట్టనున్న కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ శ్రీవాత్సవ ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ.. ఐ20కి ఎగువన ఓ కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేస్తామని చెప్పారు. సిటీ డ్రైవింగ్‌కి అనువుగా కాంపాక్ట్ సైజులో ఉంటూ, మిడ్-సైజ్ సెడాన్‌లోని ఫీచర్లను ఆఫర్ చేసేలా ఈ కొత్త కారును తీర్చిదిద్దనున్నట్లు ఆయన వివరించారు.

ఈ కొత్త హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్‌ను దీపావళి సీజన్ నాటికి మార్కెట్లో విడుదల చేస్తామని శ్రీవాత్సవ తెలిపారు. హ్యుందాయ్ ఐ20 మోడల్‌కు ఎగువన ప్రవేశపెట్టనున్న ఈ కారును ఐ30 అని పిలుస్తారా లేక వేరే పేరు ఏదైనా నిర్ణయిస్తారా అనే విషయం మాత్రం తేలాల్సి ఉంది. ఈ కారుకు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

హ్యుందాయ్ ఐ20లో ఫేస్‌లిఫ్ట్
ఇదిలా ఉండగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రస్తుతం దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఐ20 హ్యాచ్‌బ్యాక్‌లో మరోసారి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది కూడా నవంబర్ 2014 నాటికి మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. హ్యుందాయ్ ఇప్పటికే ఈ కొత్త ఐ20 కారును ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications








