హ్యుందాయ్ 18వ ఉచిత కార్ కేర్ క్లినిక్ ప్రారంభం
హ్యుందాయ్ కార్ ఇండియా తమ కస్టమర్ల కోసం ఉచిత కార్ కేర్ క్లినిక్‌ని ప్రారంభించింది. తమ కస్టమర్ రిలేషన్‌షిప్ ప్రోగ్రామ్‌లో 18వ 'ఫ్రీ కార్ కేర్ క్లినిక్'ని అక్టోబర్ 31, 2014వ తేది నుంచి నవంబర్ 9, 2014వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత హ్యుందాయ్ షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్ల వద్ద నిర్వహించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఈ క్యాంపైన్ గురించి హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. హ్యుందాయ్‌లో తాము తమ కస్టమర్ల అవసరాలను, ప్రాధాన్యతలను అర్థం చేసుకుంటామని, తమ ఉచిత కార్ కేర్ క్లినిక్‌కి అనూహ్య రీతిలో స్పందన వస్తోందని చెప్పారు.
ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లుగానే, ఈ ఏడాది కూడా 18వ ఎడిషన్ ఉచిత కార్ కేర్ క్లినిక్‌ని ప్రారంభించామని, ఈ ఏడాది మరింత ఎక్కువ సంఖ్యలో కస్టమర్లు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొంటారని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. తమ కస్టమర్లకు అత్యుత్తమ ఉత్పత్తులను మరియు సేవలను అందించాలనే తమ లక్ష్యమని శ్రీవాత్సవ తెలిపారు.

ఈ ఉచిత కార్ కేర్ క్లినిక్‌కి తీసుకువచ్చే హ్యుందాయ్ వాహనాలకు ఉచింగా 80-పాయింట్ చెకప్‌ను చేసి, ఏవైనా లోపాలు ఉంటే సరిచేయటం జరుగుతుంది. ఎయిర్-కండిషనింగ్, ఇంజన్, ఎలక్ట్రికల్ సిస్టమ్, ట్రాన్సిమిషన్, అండర్-బాడీ మొదలైన అనేక కీలక అంశాలను ఈ 80-పాయింట్ చెకప్‌లో పరిశీలిస్తారు.
అంతేకాకుండా.. ఈ సందర్భంగా కంపెనీ అధనపు వారంటీపై 20 శాతం తగ్గింపును మరియు స్పేర్స్‌పై, లేబర్ చార్జీలపై తగ్గింపులను కూడా ఆఫర్ చేస్తుంది. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని హ్యుందాయ్ డీలర్‌షిప్ లేదా సర్వీస్ సెంటర్‌ను సందర్శించండి.


Click it and Unblock the Notifications








