మే 2014లో 12.8 శాతం పెరిగిన హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు
భారతదేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ మరియు అతిపెద్ద ప్యాసింజర్ కార్ల ఎగుమతిదారు అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్) గడచిన మే నెలలో ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసుకుంది. పన్నులు తగ్గిన కారణంగా ధరలు కూడా తగ్గడంతో, కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరిగి అమ్మకాలు కూడా పెరిగాయి.
మే 2014లో హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం 51,718 కార్లను విక్రయించగా, అందులో 36,205 వాహనాలు దేశీయ విపణిలోను 15,513 వాహనాలను అంతర్జాతీయ విపణిలోను విక్రయించింది. మొత్తంగా గడచిన సంవత్సరం మే నెలకి ఈ ఏడాది మే నెలకి పోల్చి చూసుకుంటే, హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు 12.8 శాతం వృద్దని కనబరిచాయి. ఎగుమతులు మాత్రం 37.3 శాతం క్షీణించగా మొత్తం అమ్మకాలు కూడా 9 శాతం క్షీణించాయి.

ఈ సందర్భంగా హెచ్ఎమ్ఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. హ్యుందాయ్ అంతకు ముందుకు సంవత్సరం ఇదే నెలతో పోల్చుకుంటే, గడచిన మే నెలలో దేశీయ మార్కెట్లో 36,205 వాహనాలను విక్రయించి, 18.8 శాతం వృద్ధిని కనబరిచిందని, ఇటీవల విడుదల చేసిన ఎక్సెంట్, గ్రాండ్, శాంటాఫే మోడళ్ల విక్రయాలు జోరందుకోవటంతో అమ్మకాలు పెరిగాయని, రానున్న రోజుల్లోను ఇదే ట్రెండ్ కనబరుస్తామని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications








