2 నెలల్లో 40,000 బుకింగ్స్ దక్కించుకున్న హ్యుందాయ్ ఎలైట్ ఐ20

By Ravi

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, గడచిన ఆగస్ట్ నెలలో తమ సరికొత్త 'హ్యుందాయ్ ఎలైట్ ఐ20' (Hyundai Elite i20) ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. దేశీయ విపణిలో ఈ మోడల్ కొనుగోలుదారులను చక్కగా ఆకర్షిస్తోంది. ఈ కొత్త మోడల్ మార్కెట్లో విడుదలై 2 నెలల వ్యవధిలోనే 40,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను దక్కించుకుంది.

కేవల రూ.4.89 లక్షల ప్రారంభ ధరకే (బేస్ పెట్రోల్ వేరియంట్ ధర, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ ఎలైట్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ఇది మొత్తం 8 వేరియంట్లలో (4 పెట్రోల్, 4 డీజిల్) లభిస్తుంది. ఈ కారును ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా, జర్మనీలోని రుస్సెల్స్‌హీమ్‌లో హ్యుందాయ్ డిజైన్ సెంటర్ యూరప్ వద్ద డిజైన్ చేశారు.

Elite i20 Bookings

పెట్రోల్ వెర్షన్ ఎలైట్ ఐ20లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 83 పిఎస్‌ల శక్తిని, 11.7 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ ఎరా, మాగ్నా వేరియంట్స్ - 18.60 కెఎమ్‌పిఎల్ మైలేజీని, స్పోర్ట్స్, స్పోర్ట్స్ (ఆప్షనల్), ఆస్టా వేరియంట్స్ - 18.24 కెఎమ్‌పిఎల్ మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

డీజిల్ వెర్షన్ ఎలైట్ ఐ20లో 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 22.4 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. డీజిల్ వెర్షన్ ఎరా, మాగ్నా వేరియంట్స్ - 22.54 కెఎమ్‌పిఎల్ మైలేజీని, స్పోర్ట్స్, స్పోర్ట్స్ (ఆప్షనల్), ఆస్టా వేరియంట్స్ - 21.76 కెఎమ్‌పిఎల్ మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 30, 2014, 12:13 [IST]
English summary
The South Korean manufacturer had launched its Elite i20 roughly two months ago. Hyundai now claim they have received in excess of 40,000 bookings in India alone. They have also received several inquiries prior and post the launch of their hatchback.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+