దక్షిణాధిన 4 హ్యుందాయ్ డీలర్‌షిప్‌లు మూసివేత
భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ వాహనాల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియాకు, దక్షిణ భారతదేశంలో కోయంబత్తూర్, సాలెం, మధురై, వెల్లూర్‌లలో మొత్తం 24 డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి. అయితే, ఇందులో 4 డీలర్‌షిప్ కేంద్రాలను మూసివేస్తున్నట్లు హ్యుందాయ్ ప్రకటించింది.
ఆయా డీలర్‌షిప్‌లలో ఆఫర్ చేస్తున్న సర్వీసులు సరిగ్గా లేనందు వల్లే వీటిని క్లోజ్ చేస్తున్నట్లు సమాచారం. తమ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటుందనే ఉద్దేశ్యంతోనే హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హ్యుందాయ్ ఓ అంతర్జాతీయ బ్రాండ్ మరియు ప్రపంచస్థాయి ప్రమాణాలను పాటిస్తుంటుంది.

కోయంబత్తూర్‌లోని సూర్యబాలా హ్యుందాయ్, మధురైలోని ఎస్‌కెబిఆర్ హ్యుందాయ్, సాలెం లోని రమని హ్యుందాయ్ మరియు వెల్లూర్‌లోని సూసీ హ్యుందాయ్ డీలర్‌షిప్‌లను మూసివేయనున్నట్లు హ్యుందా పేర్కొంది. గడచిన ఆరు నుంచి తొమ్మిది నెలల కాలంలో పైన పేర్కొన్న డీలర్ల ద్వారా అందించబడుతున్న సేవల నాణ్యతను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు.
పూర్తిగా సేవల నాణ్యత లోపం కారణంగానే వీటిని మూసివేస్తున్నారు. సాధారణంగా, అమ్మకాల పరంగా మంచి ప్రతిభ చూపని అలాగే సేవల నాణ్యత పరంగా తరచూ ఫిర్యాదులు అందుకునే డీలర్‌షిప్‌ల విషయంలో కంపెనీ యాజమాన్యం చొరవ తీసుకొని వారి లైసెన్స్ క్యాన్సిల్ చేయటంతో పాటుగా డీలర్‌పిష్‌ను రద్దు చేయటం కూడా సహజమైన విషయమే.

భారత్‌లో ఓ డీలర్‌షిప్ ఏర్పాటు చేయటానికి సుమారు రూ.5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇందులో ల్యాండ్ లేదా ప్రాపర్టీ కలిసి ఉండదు. అంతేకాకుండా, డీలర్‌షిప్ ఏర్పాటు చేసే వారు ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ సుమారు 50-100 మంది స్టాఫ్‌ను కలిగి ఉండాలి.
హ్యుందాయ్ ఇండియా తెలిపిన సమాచారం ప్రకారం, ప్రతి ఏటా తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటామని, ప్రస్తుతం తమకు సుమారు 393 డీలర్లు ఉన్నారని, వారిలో చాలా మంది సంతృప్తిగానే ఉన్నారని పేర్కొంది. గడచిన రెండేళ్ల వ్యవధిలో హ్యుందాయ్ 50కి పైగా కొత్త డీలర్లను నియమించుకుంది. కాగా.. తమ విషయంలో హ్యుందాయ్ తీసుకున్న నిర్ణయం అసంతృప్తిని కలిగిస్తోందని మూసివేయబడిన డీలర్లు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








