8వ హ్యుందాయ్ ఆల్వేస్ అరౌండ్ సర్వీస్ క్యాంపైన్
భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ కార్ల ఎగుమతిదారు మరియు ద్వితీయ అగ్రగామి తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ వినియోగదారులకు మేమున్నాం అనే భరోసా ఇచ్చేందుకు గాను ఓ స్పెషల్ సర్వీస్ క్యాంప్‌ను ప్రారంభించింది. వాహనాల అమ్మకం తర్వాత కూడా తమ వినియోగదారులకు మెరుగైన సర్వీసింగ్ సదుపాయాలు, సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో దేశవ్యాప్తంగా "ఆల్వేస్ అరౌండ్" (ఎల్లప్పుడూ మీ వెంటే) అనే పేరుతో 8వ ఎడిషన్ సర్వీస్ క్యాంప్‌ను హ్యుందాయ్ ప్రారంభించింది.
మే 4, 2014వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ 8వ ఎడిషన్ ఆల్వేస్ అరౌండ్ క్యాంపైన్‌లో భాగంగా, ఈ సర్వీస్ క్యాంప్‌కు కస్టమర్లు తీసుకువచ్చే తమ హ్యుందాయ్ వాహనాలకు ఉచిత చెకప్ నిర్వహిస్తామని కంపెనీ పేర్కొంది. గతేడాది మొత్తం 7,410 ప్రాంతాల్లో ఈ ఉచిత సర్వీస్ క్యాంప్‌ను నిర్వహించామని, ఈ ఏడాది ఈ క్యాంప్ డిసెంబర్ 2014 వరకు కొనసాగుతుందని, ఈసారి మొత్తం 8,000 ప్రాంతాల్లో 2 లక్షల మందికి పైగా కస్టమర్లను కవర్ చేయాలనే లక్ష్యంతో ఉన్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.
హ్యుందాయ్ ఆల్వేస్ అరౌండ్ యూ క్యాంపైన్‌కు విచ్చేసే వాహనాలకు 18-పాయింట్ ఫ్రీ చెకప్ చేసి, లోపాలు ఏవైనా ఉంటే సరిచేస్తామని, ఆయిల్ టాప్అప్స్, వెహికల్ ఎగ్జామినేషన్, కూలెంట్ టాప్అప్, వెహికల్ పాలిషింగ్ వంటివి నిర్వహిస్తామని, ఏవైనా స్పేర్ పార్ట్‌లు మార్చాల్సి వస్తే, మార్కెట్ ధరల కన్నా సరసమైన ధరలకే వాటిని తమ కస్టమర్లకు అందిస్తామని హ్యుందాయ్ పేర్కొంది. ఈ సర్వీస్ క్యాంప్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను మీ సమీపంలోని హ్యుందాయ్ అధీకృత డీలర్ నుంచి పొందవచ్చు.



Click it and Unblock the Notifications








