హ్యుందాయ్ ఇండియన్ కార్పోరేట్ క్యాంపైన్ 'లైఫ్ ఈజ్ బ్రిలియంట్'
దేశపు ద్వితీయ అగ్రాగమి కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్), భారతదేశంపై దృష్టిసారిస్తూ తొలిసారిగా ఓ కార్పోరేట్ క్యాంపైన్‌ను విడుదల చేసింది. 'లైఫ్ ఈజ్ బ్రిలియంట్' పేరుతో ప్రారంభించిన ఈ కార్పోరేట్ క్యాంపైన్, భారతీయ వినియోగదారుల పట్ల తమకున్న కేరింగ్‌ను ఎమోషనల్ కనెక్ట్‌ను మరింత బలోపేతం చేయగలదని కంపెనీ పేర్కొంది.
హ్యుందాయ్ భారత మార్కెట్లోకి ప్రవేశించి విజయవంతంగా 16 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ 16 ఏళ్ల కాలంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో ప్రపంచ స్థాయి ఉత్పత్తులను ఇక్కడి వినియోగదారులకు పరిచయం చేసింది. 'న్యూ థింకింగ్, న్యూ పాజిబిలిటీస్' అనే బ్రాండ్ స్లోగన్‌తో భారత్‌లో ఓ కొత్త ట్రెండ్‌సెట్టర్ బ్రాండ్‌గా హ్యుందాయ్ అవతరించింది.
హ్యుందాయ్‌కి భారత్‌లో సుమారు 35 లక్షల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. ఈ క్యాంపైన్‌ను ప్రారంభించిన సందర్భంగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎమ్‌డి, సీఈఓ బిఎస్ సియె మాట్లాడుతూ.. భారత్‌లో తమ లక్ష్యం కేవలం కార్లను విక్రయించడమే మాత్రం కాదని, అత్యంత ప్రియమైన బ్రాండ్‌గా అవతరించడమని, వినియోగదారుల అవసరాలు, అంచనాలను మించి విలువలను, అనుభూతులను ఆఫర్ చేయడమే తమ లక్ష్యమని అన్నారు.
కార్ కేర్ సెట్ పై 10 శాతం తగ్గింపు, త్వరపడండి!
ఇండియన్ కార్పోరేట్ క్యాంపైన్ 'లైఫ్ ఈజ్ బ్రిలియంట్' టెలివిజన్ కమర్షియల్ త్వరలోనే అన్ని ప్రధాన టెలివిజన్ ఛానెళ్లలో ప్రసారం కానుంది. ఈలోపుగా ఆ కార్పోరేట్ క్యాంపైన్ వీడియోని మీరు కూడా వీక్షించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/fNJiBlc-JYA?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








