జనవరి 2015 నుంచి పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు
కొత్త సంవత్సరంలో కారు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు, ప్రస్తుత ధర కన్నా అధిక ధర చెల్లించాల్సి రావచ్చు. 2015 నుంచి ధరలను పెంచనున్న ఆటోమొబైల్ కంపెనీల్లో తాజాగా హ్యుందాయ్ వచ్చి చేరింది. జనవరి 2015 ప్రారంభం నుంచి తమ అన్ని మోడళ్ల ధరలను పెంచనున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఓ ప్రకటనలో పేర్కొంది.
మోడల్‌ను బట్టి ఈ ధరల పెంపు రూ.5,000 నుంచి రూ.25,000 మధ్యలో ఉంటుందని కంపెనీ వివరించింది. ప్రస్తుతం హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ విపణిలో ఎంట్రీ లెవల్ పెట్రోల్ కారు ఇయాన్ మొదలుకొని ప్రీమియం ఎస్‌యూవీ శాంటాఫే వరకు విభిన్న వాహనాలను విక్రయిస్తోంది. భారత మార్కెట్లో వీటి ధరలు రూ.2.87 లక్షల నుంచి రూ.28.41 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

డిసెంబర్ నెలలో హ్యుందాయ్ తమ కార్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ నేపథ్యంలో, హ్యుందాయ్ కారును కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం. అదే కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ కారును కొనుగోలు చేసినట్లయితే, మరింత ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి, త్వరపడండి.. ధరలు పెరగకముందే మీ హ్యుందాయ్ కారును సొంతం చేసుకోండి.
ప్రస్తుత ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లో, రూపాయి విలువ క్షీణత కారణంగా పెరిగిన దిగుమతి సుంకాలు, అధిక ఇన్‌పుట్ కాస్ట్, అధిక అమ్మకాల ఖర్చు మొదలైన కారణాల వలన ఉత్పాదక వ్యయం నిరంతరాయంగా పెరుగుతోందని, ఫలితంగా ధరలు పెంచడం తప్పడం లేదని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు.


Click it and Unblock the Notifications








