కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ ఇయాన్ ఫేస్‌లిఫ్ట్ విడుదల
కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న చిన్నకారు 'ఇయాన్'లో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. గడచిన అక్టోబర్ 13, 2011వ తేదీన తొలిసారిగా హ్యుందాయ్ ఇయాన్ కారు భారత మార్కెట్లో విడులైంది. ప్రత్యేకించి భారత మార్కెట్ కోసం కంపెనీ ఈ చిన్న కారును తయారు చేసింది.
మొదట్లో హ్యుందాయ్ ఇయాన్ అమ్మకాలు జోరుగానే సాగినప్పటికీ, ఈ సెగ్మెంట్లో పెరిగిన పోటీ కారణంగా క్రమంగా ఈ మోడల్ అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ చిన్నకారులో కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టి, తిరిగి పూర్వవైభవాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. ఇయాన్ ఇప్పుడు రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది.
అందులో ఒకటి 800సీసీ వెర్షన్, మరొకటి 1000సీసీ వెర్షన్. హ్యుందాయ్ ఇయాన్ 800లో 814సీసీ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 55 బిహెచ్‌పిల శక్తిని, 76.5 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఇది లీటరుకు 21.1 కి.మీ. మైలేజీనిస్తుంది.

ఇకపోతే, 1000సీసీ వెర్షన్ ఇయాన్‌లో 1.0 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. యూరో 5 నిబంధనలు పాటించే ఈ కొత్త 1.0 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్ అధునాతన డ్యూయెల్ విటివిటి టెక్నాలజీతో అనుసంధానం చేయబడి ఉండి, అధిక పెర్ఫార్మెన్స్‌ను, మెరుగైన మైలేజీని మరియు తక్కువ కర్భన వ్యర్థాలను విడుదల చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఇంజన్ గరిష్టంగా 6200 ఆర్‌పిఎమ్ వద్ద 69 పిఎస్‌ల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 9.6 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో లభిస్తుంది.
కాగా.. కొత్తగా రానున్న హ్యుందాయ్ ఇయాన్ ఫేస్‌లిఫ్ట్ విషయానికి వస్తే.. ఇందులో డిజైన్, ఫీచర్ల పరంగా పలు అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి. కానీ మెకానికల్‌గా మాత్రం ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని అంచనా. కంపెనీ అంత్యంత పాపులర్ అయిన ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా కొత్త ఇయాన్‌ను డిజైన్ చేసే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








