హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కారుకి అశేష స్పందన

By Ravi

హ్యుందాయ్ మోటార్ ఇండియా, గడచిన ఆగస్ట్ నెలలో విడుదల చేసిన సరికొత్త 'హ్యుందాయ్ ఎలైట్ ఐ20' (Hyundai Elite i20) ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌కు దేశీయ విపణిలో మంచి ఆదరణ లభిస్తోంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించిన హ్యుందాయ్ ఎలైట్ ఐ20, అతి తక్కువ సమయంలోనే ఇదివరకు కంపెనీ విడుదల చేసిన గ్రాండ్ ఐ10, ఎక్సెంట్ మోడళ్ల కన్నా ఎక్కువ బుకింగ్‌లను దక్కించుకుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ విడుదలైన 20 రోజుల్లో 10,000 యూనిట్ల బుకింగ్‌లను దక్కించుకోగా, హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ 30 రోజుల్లో 11,000 బుకింగ్‌లను సొంతం చేసుకుంది. కాగా.. తాజాగా విడుదలైన హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కేవలం 20 రోజుల్లోనే 15,300 యూనిట్లకు పైగా బుకింగ్‌లను సొంతం చేసుకొని కంపెనీ మరొక సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలిచింది.


దేశవ్యాప్తంగా హ్యుందాయ్ ఐ20 కారుకి ఇప్పటి వరకు 79,200 లకు పైగా ఎంక్వైరీలు వచ్చినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. వినియోగదారుల నుంచి ఎలైట్ ఐ20కి లభిస్తున్న ఆదరణతో ఇది కూడా మరొక సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలిచిందని, వరుసగా ఇది తమకు 5వ సక్సెస్‌ఫుల్ ఉత్పత్తి అన్నారు.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించుకునేందుకు ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఎలైట్ ఐ20 మొత్తం 8 వేరియంట్లలో (4 పెట్రోల్, 4 డీజిల్) లభిస్తుంది. ఈ కారును ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా, జర్మనీలోని రుస్సెల్స్‌హీమ్‌లో హ్యుందాయ్ డిజైన్ సెంటర్ యూరప్ వద్ద డిజైన్ చేశారు. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర కేవలం రూ.4.89 లక్షలు మాత్రమే (బేస్ పెట్రోల్ వేరియంట్ ధర, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Elite i20

పెట్రోల్ వెర్షన్ ఎలైట్ ఐ20లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 83 పిఎస్‌ల శక్తిని, 11.7 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ ఎరా, మాగ్నా వేరియంట్స్ - 18.60 కెఎమ్‌పిఎల్ మైలేజీని, స్పోర్ట్స్, స్పోర్ట్స్ (ఆప్షనల్), ఆస్టా వేరియంట్స్ - 18.24 కెఎమ్‌పిఎల్ మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

డీజిల్ వెర్షన్ ఎలైట్ ఐ20లో 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 22.4 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. డీజిల్ వెర్షన్ ఎరా, మాగ్నా వేరియంట్స్ - 22.54 కెఎమ్‌పిఎల్ మైలేజీని, స్పోర్ట్స్, స్పోర్ట్స్ (ఆప్షనల్), ఆస్టా వేరియంట్స్ - 21.76 కెఎమ్‌పిఎల్ మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 2, 2014, 14:22 [IST]
English summary
Hyundai Motor India Limited has received an overwhelming response of its newly launched all-new Elite i20 and has set a new benchmark in the premium hatchback segment. Marking the World Premier of the 2nd Generation of i20 in India on August 11, 2014, the car has received highest bookings ever of 15,300 units in 20 days.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+