హ్యుందాయ్ శాంటాఫే లేటెస్ట్ టివిసికి 7 రోజుల్లో 20 లక్షల హిట్స్

హ్యుందాయ్ అందిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ శాంటాఫే కోసం ఏలియన్స్ థీమ్‌తో తయారు చేసి, యూట్యూబ్‌లో విడుదల చేసిన ప్రకటన రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఈ వీడియోని విడుదల చేసిన 7 రోజుల్లోనే 20 లక్షలకు పైగా హిట్స్ వచ్చాయని హ్యుందాయ్ ఓ ప్రకటనలో పేర్కొంది. శాంటాఫే పవర్‌ను తెలియజేస్తూ హ్యుందాయ్ రూపొందించిన ఈ ప్రకటన అక్టోబర్ 1, 2014న విడుదలైంది.

ఏలియన్స్ (గ్రహాంతర వాసులను) పట్టుకునే నేపథ్యంలో ఈ ప్రకటన సాగుతుంది. ఇందులో శాంటాఫే ఎస్‌యూవీని నాశనం చేయటానికి వచ్చిన ఏలియన్స్ అన్నీ, అదే ఎస్‌యూవీ చేతికి చిక్కి మనుషులకు బానిసలుగా మారిపోతుంటాయి. ఈ వీడియోలోని చివరి ఘట్టం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. మరి ఆ ఫన్నీ కమర్షియల్ వీడియోని మీరు చాశారా.. ఒకవేళ మిస్ అయి ఉంటే మళ్లీ ఇక్కడ చూసేయండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/OdJjqVWKw4w?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>
ఇక కొత్త హ్యుందాయ్ శాంటాఫే విషయానికి వస్తే.. ఈ ఏడాది గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పోజిషన్ మార్ట్ లిమిటెడ్‌ వద్ద నిర్వహించిన 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో హ్యుందాయ్ తమ సరికొత్త శాంటాఫే ఎస్‌యూవీని విడుదల చేసింది. మునపటి వెర్షన్ శాంటాఫే మోడల్‌ను రీప్లేస్ చేస్తూ, పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై ఈ మోడల్‌ను తయారు చేశారు.

భారత మార్కెట్లో మూడవ తరానికి చెందిన ఈ కొత్త శాంటాఫే ధర రూ.26 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పైమాటే. ఇందులో 2.2 లీటర్ విజిటి (వేరియబల్ జియోమెట్రీ టర్బో) డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 194 బిహెచ్‌పిల శక్తిని, 44.55 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డీజిల్ ఇండన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 9, 2014, 13:33 [IST]
English summary
Hyundai Motor India, the country’s largest exporter and the second-largest car manufacturer, launched its unique viral campaign of the Hyundai Santa Fe #Alienscaptured on October 01, 2014. The campaign designed to showcase the power of Santa Fe has generated over 2 million views on YouTube within a week of the launch.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+