నవంబర్‌లో 10,500 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కార్ల విక్రయం

By Ravi

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మరియు దేశంలో కెల్లా అతిపెద్ద కార్ల ఎగుమతిదారు అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా, గడచిన ఆగస్ట్ నెలలో మార్కెట్లో విడుదల చేసిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'హ్యుందాయ్ ఎలైట్ ఐ20' (Hyundai Elite i20), అతికొద్ది సమయంలోనే విపణిలో సక్సెస్‌ఫుల్ మోడల్‌గా పేరు తెచ్చుకుంది.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కారుకి ఇప్పటి వరకూ 56,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను వచ్చినట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసినదే. కాగా.. కేవలం ఒక్క నవంబర్ 2014 నెలలో హ్యుందాయ్ మొత్తం 10,500 ఎలైట్ ఐ20 కార్లు అమ్ముడుపోయినట్లు కంపెనీ పేర్కొంది. ఆకర్షనీయమైన డిజైన్, ప్రీమియం లుక్, మోడ్రన్ ఫీచర్లతో ఎలైట్ ఐ20 కస్టమర్లను ఆకర్షిస్తోంది.


కేవలం రూ.4.89 లక్షల ప్రారంభ ధరకే (బేస్ పెట్రోల్ వేరియంట్ ధర, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ ఎలైట్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ఇది మొత్తం 8 వేరియంట్లలో (4 పెట్రోల్, 4 డీజిల్) లభిస్తుంది. ఈ కారును ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా, జర్మనీలోని రుస్సెల్స్‌హీమ్‌లో హ్యుందాయ్ డిజైన్ సెంటర్ యూరప్ వద్ద డిజైన్ చేశారు.

పెట్రోల్ వెర్షన్ ఎలైట్ ఐ20లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 83 పిఎస్‌ల శక్తిని, 11.7 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ ఎరా, మాగ్నా వేరియంట్స్ - 18.60 కెఎమ్‌పిఎల్ మైలేజీని, స్పోర్ట్స్, స్పోర్ట్స్ (ఆప్షనల్), ఆస్టా వేరియంట్స్ - 18.24 కెఎమ్‌పిఎల్ మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

Hyundai Elite i20

డీజిల్ వెర్షన్ ఎలైట్ ఐ20లో 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 22.4 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. డీజిల్ వెర్షన్ ఎరా, మాగ్నా వేరియంట్స్ - 22.54 కెఎమ్‌పిఎల్ మైలేజీని, స్పోర్ట్స్, స్పోర్ట్స్ (ఆప్షనల్), ఆస్టా వేరియంట్స్ - 21.76 కెఎమ్‌పిఎల్ మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 4, 2014, 17:20 [IST]
English summary
Hyundai had launched their Elite i20 four months ago in India. The manufacturer has achieved securing 56,000 booking for the hatchback out of 3,00,000 enquiries since its launch. They have also achieved another milestone by selling 10,500 Elite i20 in November, 2014 alone.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+