మార్చ్ 12న హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ విడుదల

By Ravi

హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న గ్రాండ్ 10 హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన సరికొత్త హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్‌ను ఈ నెల రెండవ వారంలో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే.

కాగా.. కంపెనీ ఇప్పుడు ఇదే విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. 'హ్యుందాయ్ ఎక్సెంట్' (Hyundai Xcent)ను మార్చ్ 12, 2014వ తేదీన భారత మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల చేయనున్నట్లు హ్యుందాయ్ ఓ ప్రకటనలో పేర్కొంది.

Hyundai Xcent Launch Date

హ్యుందాయ్ తమ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్‌ను తొలిసారిగా గడచిన ఫిబ్రవరి 4, 2014వ తేదీన న్యూఢిల్లీలో ఆవిష్కరించి, ఆ తర్వాత 2014 ఆటో ఎక్స్‌పోలో కూడా ప్రదర్శనకు ఉంచింది. 'హ్యుందాయ్ అసెంట్' స్థానాన్ని ఈ కాంపాక్ట్ సెడాన్ భర్తీ చేయనుంది.

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ వంటి మోడళ్లతో పాటుగా త్వరలో మార్కెట్లోకి రానున్న టాటా జెస్ట్, ఫోర్డ్ ఫిగో కాంపాక్ట్ సెడాన్ వంటి మోడళ్లకు సైతం పోటీగా నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 6, 2014, 11:00 [IST]
English summary
Hyundai Xcent will be launched on March 12. Hyundai's first compact sedan, the Xcent, was first previewed right before the start Auto Expo last month and was later displayed at the expo for the public to get a visual taste of it.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+