మన రోడ్లపై ప్రతి ఐదు నిమిషాలకు ఒకరు మృతి!
గతంలో మనదేశంలో తయారైన ఎంట్రీ లెవల్ కార్లను యూరో ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్ చేసినప్పుడు, అందులో దాదాపు అన్ని మేడ్ ఇన్ ఇండియా కార్లు ఈ టెస్ట్‌లో ఫెయిల్ అయిన సంగతి తెలిసినదే. అయితే, కార్ల సేఫ్టీ విషయంలో ఇటు ప్రజలలో అవగాహన పెరగటం అటు ప్రభుత్వం నుంచి వత్తిడి రావటంతో, ఇండియాలో తయారైన దాదాపు అన్ని కార్లకు క్రాష్ టెస్ట్ నిర్వహించాలనే నిబంధనలు వెలువడ్డాయి.
ఇది కూడా చదవండి: గర్బిణీ స్త్రీలే ఎక్కువగా ప్రమాదలకు గురవుతుంటారు!
ప్రస్తుతం భారతదేశంలో రోడ్డు ప్రమాదల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజా అధ్యయనాల ప్రకారం, భారత రోడ్లపై ప్రతి ఐదు నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ సంబంధిత మరణాలను నియంత్రించేందుకు ఆటోమొబైల్ తయారీదారులు తమ వాహనాల్లో ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్‌ను ఇకపై స్టాండర్డ్ ఫీచర్లుగా ఆఫర్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

అంతేకాకుండా, కార్ కంపెనీలు తమ కార్ల విషయంలో నిర్వహించిన క్రాష్ టెస్ట్ ఫలితాలను వెల్లడించి, తమ కార్లు ఎంత సురక్షితమైనవో కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రపంచ మార్కెట్లలో అమ్ముడయ్యే అన్ని కార్లలో ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్‌గా ఉంటాయి. ఆయా దేశాల్లో ఈ ఫీచర్లు లేని వాహనాలను తయారు చేయటానికి ప్రభుత్వ అనుమతి ఉండదు.
ఇది కూడా చదవండి: మహిళలకు కారు పార్కింగ్ చేయటమే రాదు!
కానీ, మనదేశంలో మాత్రం తయారీదారులు కారు ధరను దృష్టిలో ఉంచుకొని ఈ ఫీచర్లను తొలగించి తక్కువ ధరకే ఉత్పత్తులను ఆఫర్ చేస్తుంటాయి. అయితే, ఇండియాలో తయారై విదేశాలకు ఎగుమతి అయ్యే మోడళ్లలో మాత్రం మన తయారీదారులు ఈ సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరిగా అమర్చుతారు. అంటే, కేవలం మన దేశంలో మాత్రమే ప్రయాణీకుల సేఫ్టీని గాలికి వదిలేస్తున్నారన్నమాట.

ఈ నేపథ్యంలో, ఇకపై కార్లలో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఎయిర్‌బ్యాగ్స్‌తో ఈఎస్‌సి (ఎలక్ట్రానిక్ స్టెబిల్టీ కంట్రోల్)ను కూడా తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కారులో ఈ ఫీచర్లు ఉండటం వలన అత్యవర పరిస్థితుల్లో ప్రమాదాలు కొంతమేరైనా తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఈ ఫీచర్లను స్టాండర్డ్‌గా కార్లలో ఆఫర్ చేస్తే, వాటి ధరలు అమాంతం పెరిగే ఆస్కారం ఉంది. మరి మన కంపెనీలు ఈ ఫీచర్లను జోడించి ధరలను పెంచుతాయో లేదో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








