భారత్‌లో తొలి ఎక్స్‌క్లూజివ్ హార్మన్ సౌండ్ లాంజ్ ప్రారంభం
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రీమియం ఆడియో సిస్టమ్‌ల తయారీ సంస్థ 'హర్మన్' (జెబిఎల్ సబ్ బ్రాండ్) చెన్నైలో తమ తొలి ఎక్స్‌క్లూజివ్ హార్మన్/కార్డన్ సౌండ్ లాంజ్‌ను ప్రారంభించింది. ఈ స్టోర్‌ను ప్రముఖ వోకలిస్ట్ కుమారి సునీతా సారథి ప్రారంభించగా, ప్రముఖ సంగీతకారుడు మరియు జెబిఎల్ ఆడియో బ్రాండ్ అంబాసిడర్ అయిన ఏఆర్ రెహ్మాన్‌ను ఈ స్టోర్ ప్రారంభానికి విచ్చేశారు.
హార్మన్/కార్డన్ సౌండ్ లాంజ్‌లో హెడ్‌ఫోన్‌లు, మల్టీమీడియా స్పీకర్లు, డాక్స్, హోమ్ థియేటర్స్, కార్ ఆడియో వంటి అన్ని రకాల ఆడియో సిస్టమ్‌లను ఆఫర్ చేస్తున్నారు. హర్మన్‌కు బెంగుళూరులో ఓ రీజనల్ హెడ్‌క్వార్టర్స్ కూడా ఉంది. భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి లగ్జరీ కార్ల కోసం హర్మన్ ఆడియో సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తుంది. స్పష్టమైన సంగీతాన్ని అందించడంలో హర్మన్ ఆడియో సిస్టమ్‌లకు పెట్టింది పేరు.

జెబిఎల్, ఏకెజి హర్మన్-కార్డన్ అనే వివిధ బ్రాండ్‌ల పేరుతో ఉత్పత్తులను అందిస్తుంది. ఫోక్స్‌వ్యాగన్, డైమ్లర్, టొయోటా, ఫియట్ స్పా, జనరల్ మోటార్స్, హ్యుందాయ్, ఫెరారీ మొదలగు కంపెనీలకు హర్మన్ తన ఆడియో సిస్టమ్‌లను సరఫరా చేస్తుంది. అలాగే, ఇండియాలో మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీలకు తమ ఉత్పత్తులు సరఫరా చేయాలని యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








