త్వరలో క్రాష్ టెస్ట్ కోసం ఏర్పాట్లు చేయనున్న భారత్
భారత మార్కెట్లో తయారై, విక్రయించబడుతున్న ప్యాసింజర్ కార్లు ఇకపై తప్పనిసరిగా క్రాష్ టెస్టులో పాస్ కావల్సి ఉంటుంది. ఈ మేరకు భారత ప్రభుత్వం త్వరలోనే క్రాష్ టెస్ట్ నిబంధనలను వెల్లడి చేయనుంది. ఈ నిర్ణయం ద్వారా కార్ కంపెనీలు ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసేలా ప్రోత్సహించి, ప్రమాద రహిత వాతావరణాన్ని సృష్టించాలని సర్కారు ముఖ్య ఉద్దేశ్యం.
ఈ విషయం గురించి రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రి పోన్ రాధాక్రిష్ణన్ రాజ్యసభలో మాట్లాడుతూ.. ప్యాసింజర్ కార్ల కోసం ఫ్రంటల్ అండ్ సైడ్ ఇంపాక్ట్ క్రాష్ టెస్ట్ నిబంధనలను తప్పనిసరి చేయనుందని, ఇందుకు కావల్సిన ఏర్పాట్లను నేషనల్ ఆటోమోటివ్ టెస్టింగ్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు.

ఈ ఏర్పాట్లు పూర్తి కాగానే, ఇందుకు సంబంధించిన నిబంధనలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఈ నిబంధనలను పాటించాలంటే, అనేక కార్ కంపెనీ తమ కార్లలో ఎయిర్‌బ్యాగ్స్ వంటి కనీస సేఫ్టీ ఫీచర్లను అమర్చాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. ఈ ఇష్యూపై మరింత అవగాహన పొందేందుకు ప్రభుత్వం, భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్)తో కలిసి పనిచేయనుంది.
భారత మార్కెట్లో అమ్ముడవుతున్న పాపులర్ కార్ మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన బడ్జెట్ కార్ డాట్సన్ గో కార్లు గడచిన నెలలో గ్లోబల్ ఎన్‌సిఏపి నిర్వహించిన క్రాష్ టెస్టులో విఫలమైన సంగతి తెలిసినదే. అలాగే, ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన క్రాష్ టెస్టులలో ఫోర్డ్ ఫిగో, ఫోక్స్‌వ్యాగన్ పోలో, హ్యుందాయ్ ఐ10 వంటి మోడళ్లు కూడా విఫలం అయ్యాయి.


Click it and Unblock the Notifications








