ఏప్రిల్-జులైలో 5 శాతం తగ్గిన భారత కార్ ఎగుమతులు

By Ravi

భారత మార్కెట్లో తయారు చేసిన కార్లను ఆటోమొబైల్ కంపెనీ పలు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్న సంగతి తెలిసినదే. ఇందులో ప్రధానంగా భారతదేశం నుంచి యూరప్ మార్కెట్‌కు ఎక్కువగా కార్లు ఎగుమతి అవుతుంటాయి. అయితే, ఇటీవలి కాలంలో పలు కంపెనీలు యూరప్ మార్కెట్‌కు ఎగుమతులు తగ్గించి వేయడంతో చిన్న కార్ల ఎగుమతులకు గ్లోబల్‌ హబ్‌గా మారాలన్న భారత్‌ కలలకు గండిపడినట్లయింది.

భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్‌-జూలై 2014 మధ్య కాలంలో భారత్ నుంచి ఎగుమతయ్యే కార్ల సంఖ్య 5.02 శాతం (1,71,274 యూనిట్ల వరకు) తగ్గింది. గడచిన సంవత్సం ఇదే సమయంలో భారత్ నుంచి ఎగుమతి అయిన కార్ల సంఖ్య 1,80,332 యూనిట్లుగా ఉన్నట్లు సియామ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Car Exports

భారతీయ కార్ల ఎగుమతి పునరీకీకరణ జరుగుతోందని, గతంలో అత్యధికంగా ఎగుమతులు యూరప్, దక్షిణాసియా దేశాలకే జరిగేవనీ, ప్రస్తుతం అవి తగ్గడం వల్లనే ఎగుమతుల్లో క్షీణత నమోదైందని సియామ్ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాథుర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో, పలు ఆటోమొబైల్ కంపెనీలు యూరప్‌ను వదిలి లాటిన్‌ అమెరికా, ఆఫ్రికాల్లో కొత్త మార్కెట్ల నిర్మాణంపై దృష్టి సారించాయని ఆయన అన్నారు.

యూరప్ మరియు దాని పొరుగు దేశాలకు ఎగుమతులు నిలిచిపోవటం వలన వచ్చిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు కొంత సమయం పడుతుందని, ఇప్పటికే దేశంలోని అతి పెద్ద కార్ల ఎగుమతిదారు అయిన హ్యుందాయ్ తమ చెన్నై ప్లాంట్ నుంచి యూరప్‌కు కార్లను ఎగుమతి చేయటాన్ని నిలిపి వేసిందని మాథుర్ వివరించారు.

More from DriveSpark

Article Published On: Tuesday, August 19, 2014, 16:19 [IST]
English summary
India's ambitious plan to become a global hub for small car exports has taken a hit due to falling shipments to Europe, while unfavourable environment in the neighbourhood has led to lost opportunities to the tune of $2 billion.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+