జైలులో కార్ స్పేర్స్‌ను తయారు చేయనున్న ఖైదీలు

By Ravi

కార్లను దొంగిలించే దొంగలే కొత్త కార్లను తయారు చేస్తే, వినడానికే విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజం. జైలులో శిక్షణ అనుభవిస్తున్న ఖైదీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో, జైలు ఆవరణంలోనే ఓ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పింది ఓ ఇండో-జపాన్ జాయింట్ వెంచర్ కంపెనీ.

భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఈ తరహా విధానానికి శ్రీకారం చుట్టారు భారత్‌కు చెందిన స్పార్క్ మిండా, అశోఖ్ మిండా గ్రూప్ మరియు జపాన్‌కు చెందిన ఫురుకవా కంపెనీల జాయింట్ వెంచర్ మిండా ఫురుకవా ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎమ్ఎఫ్ఈ).

తీహార్ జైలులో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఢిల్లీ జైళ్లకు డైరక్టర్ జనరల్ అయిన అశోక్ వెర్మ ఈ స్మాల్ స్కేల్ ప్రొడక్షన్ యూనిట్‌ని ప్రారంభించారు. ఈ కంపెనీ వైరింగ్ హార్నెస్ మరియు ఫోర్ వీలర్స్ కోసం అవసరమైన వైరింగ్ లూమ్స్‌కు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేస్తుంది.

Inmates To Build Car Spares

ఈ సందర్భంగా, ఢిల్లీ జైళ్ల డిఐజి, పిఆర్ఓ ముకేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ చర్య వలన జైలులో శిక్షకాలం అనుభవిస్తున్న వారు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది, ఈ ప్లాంట్ ఏర్పాటు వలన వారు తర్ఫీదు పొందటంతో పాటుగా వేతనం కూడా పొందుతారని, వారి శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఈ అనుభవమే వారికి మంచి ఉపాధిని చూపించేందుకు పనికొస్తుందని అన్నారు.

ఈ ప్రొడక్షన్ విధానాన్ని సూపర్‌వైజర్ల ద్వారా పర్యవేక్షించబడుతుంది, ఇతర ఖైదీలు సంపాధించుకునే మొత్తంతో పోల్చుకుంటే ఈ ప్లాంట్‌లో పనిచేసే ఖైదీలు ఎక్కువ డబ్బును సంపాధించుకోవచ్చు. ప్రారంభంలో భాగంగా, 30 మంది ఖైదీలు ఈ ప్లాంట్‌లో పనిచేస్తారని, ఆ తర్వాతి క్రమంగా వీరి సంఖ్య పెరుగుతుందని ప్రసాద్ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Monday, September 8, 2014, 12:25 [IST]
English summary
For the first time in India, a manufacturing unit has been set up inside a jail, where the inmates will be involved in manufacturing automotive components. Minda Furukawa Electric Pvt. Ltd (MFE), a joint venture between Spark Minda, Ashok Minda Group from India and Furukawa of Japan, have set up their manufacturing facility in Tihar.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+