తిరుపతిలో ఇసుజు మోటార్స్ డీలర్‌షిప్ ప్రారంభం
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం 'ఇసుజు మోటార్స్' ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో డీలర్‌షిప్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈసారి తమ డీలర్‌షిప్‌ను తిరుపతిలో ప్రారంభించారు. తిరుపతిలోని రేణిగుంట రోడ్‌లో ఈ కొత్త షోరూమ్‌ను ఇసుజు మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్ టకాషి కికుచి ప్రారంభించారు. మొత్తం 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ తమకు అతి ముఖ్యమైన మార్కెట్ అని, ఈ రాష్ట్రంలో తమ ఉత్పత్తులకు మంచి స్పందన లభిస్తోందని టకాషి కికుచి తెలిపారు. ఇసుజు మోటార్స్‌కు ఇప్పటికే చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, కొచ్చి, కోయంబత్తూర్, విశాఖపట్టణం, మధురై నగరాల్లో డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి.

కాగా.. తాజాగా తిరుపతిలో ప్రారంభించిన డీలర్‌షిప్ ఇసుజు మోటార్స్‌కి దేశంలో 8వ షోరూమ్ కావటం విశేషం. ఇసుజు 2015-16 నాటికి భారత్‌లో తమ డీలర్‌షిప్ కేంద్రాలను 60కు పెంచుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఇసుజు దేశీయ విపణిలో ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ (రూ.22.93 లక్షలు - బిఎస్ 4, (రూ.22.63 లక్షలు - బిఎస్ 3) మరియు డి-మ్యాక్స్ (రూ.7.39 లక్షలు) పికప్ ట్రక్కులను విక్రయిస్తోంది.
ఇదిలా ఉండగా.. ఇసుజు మోటార్స్ గడచిన జనవరి నెలలో రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో రూ.3000 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఉత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసినదే. శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంటు 2015-16 నాటికి పూర్తి కావచ్చని అంచనా. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి కార్ ప్లాంట్ కావటం విశేషం. ఈ ప్లాంటులో ప్రధానంగా పికప్ ట్రక్స్, ఎస్‌యూవీలను ఉత్పత్తి చేయనున్నారు.


Click it and Unblock the Notifications








