భారత్‌లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ 5వ వార్షికోత్సవ వేడుకలు
బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారత్ మార్కెట్లోకి ప్రవేశించి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కంపెనీ తమ కస్టమర్ల కోసం విశిష్టమైన ఆఫర్‌ను ప్రకటించింది. భారత్‌లో విక్రయిస్తున్న కొన్ని మోడళ్లపై జాగ్వార్ ల్యాండ్ రోవర్ 3 ఏళ్ల విశిష్ట సర్వీస్ ప్లాన్‌ను ఆఫర్ చేయనుంది.
గడచిన ఐదేళ్ల కాలంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారత మార్కెట్లో స్థిరమైన వృద్ధిని సాధిస్తు, మంచి ప్రాచుర్యాన్ని దక్కించుకుంది. భారతీయులు కూడా ఈ బ్రిటీష్ బ్రాండ్‌ను చక్కగా అంగీకరిస్తున్నారు. జాగ్వార్ 'అలైవ్' డ్రైవ్ ఎక్స్‌పీరియెన్స్ అనే కార్యక్రమంలో భాగంగా జాగ్వార్ ఇండియా భారతదేశవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్ల కోసం ఓ మల్టీ-సిటీ డ్రైవ్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రకటించింది.

ఈ కస్టమర్ ఎంగేజ్‌మెంట్ ప్రణాళికలో భాగంగా, జాగ్వార్ ఎఫ్-టైప్, జాగ్వార్ ఎక్స్‌కెఆర్-ఎస్ వంటి హై-ఎండ్ లగ్జరీ కార్లను డ్రైవ్ చేసే అవకాశాన్ని కంపెనీ తమ కస్టమర్లకు కలిగించనుంది. ప్రస్తుతం జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు భారతదేశవ్యాప్తంగా ఉన్న 19 ప్రధాన నగరాల్లో 21 డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ సంఖ్యను 23కి పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది.
జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు మహారాష్ట్రలోని పూనేలో ఓ అసెంబ్లింగ్ యూనిట్ ఉంది. ఈ ప్లాంట్‌లో కంపెనీ తమ పాపులర్ ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2, జాగ్వార్ ఎక్స్ఎఫ్, 2014 జాగ్వార్ ఎక్స్‌జె మోడళ్లను తయారు చేస్తోంది. కాగా.. భారత్‌లో జేఎల్ఆర్ ఈ మూడు మోడళ్లతో పాటుగా జాగ్వార్ ఎక్స్‌కె, జాగ్వార్ ఎఫ్-టైప్, రేంజ్ రోవర్ స్పోర్ట్, రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ ఎవోర్, డిస్కవరీ 4 మోడళ్లను కూడా విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications








