జాగ్వార్ ఎక్స్ఎఫ్ 2.2లీ డీజిల్ విడుదల: ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న పవర్‌ఫుల్ సెడాన్ ఎక్స్ఎఫ్‌లో ఓ సరికొత్త వేరియంట్‌ను కంపెనీ నేడు మార్కెట్లో విడుదల చేసింది. 2.2 లీటర్ డీజిల్ ఇంజన్‌తో విడుదలైన ఈ కొత్త వేరియంట్‌ను 'జాగ్వార్ ఎక్స్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడిషన్' అని పిలువనున్నారు. ఈ కారు ఓవరాల్ డైమన్షన్స్‌లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు.
జాగ్వార్ ఎక్స్ఎఫ్ 2.2లీ డీజిల్ ధర:
- జాగ్వార్ ఎక్స్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడిషన్ ధర - రూ.45.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)

ఈ కారులో పవర్‌ఫుల్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3500 ఆర్‌పిఎమ్ వద్ద 187 హార్స్‌పవర్‌ల శక్తిని, 2000 ఆర్‌పిఎమ్ వద్ద 450 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
జాగ్వార్ ఎక్స్ఎఫ్ 2.2లీ డీజిల్ స్పెసిఫికేషన్:
- నావిగేషన్ సిస్టమ్
- ఫుల్ సైజ్ స్పేర్ వీల్
- ఫుల్ కలర్ టచ్ స్క్రీన్
- జాగ్వార్ స్మార్ట్ కీ సిస్టమ్
- కీలెస్ స్టార్ట్
- ఇంటీరియర్ మూడి లైటింగ్
- ఎసక్ట్రిక్ ఫ్రంట్ సీట్స్
- పవర్‌ఫోల్డ్ ఎక్స్టీరియర్ మిర్రర్స్
జాగ్వార్ ఎక్స్ఎఫ్ 2.2లీ డీజిల్ సేఫ్టీ:
- ఎయిర్‌బ్యాగ్స్
- పెడస్టేరియన్ కాంటాక్ట్ సెన్సింగ్
- ఫ్రంట్ సీట్ విప్లాష్ రెడక్షన్ సిస్టమ్


Click it and Unblock the Notifications








