ఇండియాకు రానున్న 2015 ల్యాండర్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్

By Ravi

యూరో ఎన్‌సిఏపి (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) క్రాష్ టెస్టులో అత్యధిక సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకున్న 2015 ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ మోడల్ వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల కానున్నట్ల సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో ఇది ముందుగా యూరోపియన్ మార్కెట్లలో విడుదల కానుంది. ఆ తర్వాత 2015 మధ్య భాగం నాటికి ఇండియాలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

కొత్త 2015 ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ మోడల్ ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఇది ఈ సెగ్మెంట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3, ఆడి క్యూ5, వోల్వో ఎక్స్‌సి60 వంటి మోడళ్లతో పోటీ పడనుంది. ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ అయినప్పటికీ, కస్టమర్ల ఇష్టం ఎంపిక మేరకు ఇది 7-సీటర్, 5-సీటర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.

JLR To Bring 2015 Land Rover Discovery Sport To India

డిస్కవరీ స్పోర్ట్‌ను ల్యాండ్ రోవర్ నుంచి అత్యంత పాపులర్ అయిన రేంజ్ రోవర్ ఎవోక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసినప్పటికీ, ఎవోక్‌తో పోల్చుకుంటే ఇందులో 50 శాతం కొత్త భాగాలను ఉపయోగించారు.

ఈ మోడల్ మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. అందులో ఒకటి 2.0 ఎస్ఐ4 పెట్రోల్, 9-స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్. మిగిలినవి 2.2 టిడి4 డీజిల్ మరియు 2.2 ఎస్‌డి4 డీజిల్ వేరియంట్. ఇవి రెండూ 9-స్పీడ్ ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లతో లభ్యం కానున్నాయి. దీని ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉన్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, December 20, 2014, 16:04 [IST]
English summary
The 2015 Land Rover Discovery Sport will finally make its way in to showrooms in Europe in January, 2015 and India isn't too far behind on the list of markets. The SUV will land on Indian shores in the first-half of 2015.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+