సెప్టెంబర్ 22న లాంబోర్గినీ హారికేన్ విడుదల

By Ravi

ఇటాలియన్ సూపర్‌కార్ కంపెనీ లాంబోర్గినీ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న లేటెస్ట్ సూపర్‌కార్ 'లాంబోర్గినీ హారికేన్' (Lamborghini Huracan) సెప్టెంబర్ 22న భారత మార్కెట్లో విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన లాంబోర్గినీ గల్లార్డో మోడల్‌కు సక్సెసర్‌గా ఈ లాంబోర్గినీ హారికేన్ సూపర్‌కారును తయారు చేశారు.

ఇది కూడా చదవండి: బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ బెంజ్ ఎస్-గార్డ్

ఈ కారుకు 1879 కాలానికి చెందిన స్పానిష్ ఫైటింగ్ బుల్ (దున్నపోతు) నుంచి స్ఫూర్తి పొంది హారికేన్ అనే పేరును పెట్టారు. లాంబోర్గినీ హారికేన్ ఎల్‌పి 640-4 పేరులో ఎల్‌పి అంటే, 'లాంగిట్యూడినేల్ పోస్టెరీయోర్'. ఇది ఇంజన్ ఓరియంటేషన్‌ను ప్రతిభింభింపజేస్తుంది. ఇందులో 610 అంటే ఇంజన్ నుంచి వెలవడే శక్తి (పిఎస్‌లలో), 4 అంటే ఫోర్ వీల్ డ్రైవ్ అని అర్థం.

Lamborghini Huracan

లాంబోర్గినీ హారికేన్ ఎల్‌పి 640-4 కారులో 5.2 లీటర్ వి10 ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8250 ఆర్‌పిఎమ్ వద్ద 610 పిఎస్‌ల శక్తిని, 560 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ లాంబోర్గినీ డోపియా ఫ్రిజియోన్ (ఎల్‌డిఎఫ్) సెవన్-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఇది కూడా చదవండి: హై హీల్స్ కన్నా స్లిప్పర్స్ ధరించి డ్రైవ్ చేయటమే ప్రమాదం

ఈ కారు కేవలం 3.2 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని, 9.9 సెకండ్ల వ్యవధిలో 0-200 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్టం వేగం గంటకు 325 కిలోమీటర్లు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆప్షనల్ లాంబోర్గినీ డైనమిక్ స్టీరింగ్, మ్యాగ్నెటో-రియోలాజికల్ డ్యాంపర్స్ వంటి ఫీచర్లు ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినవి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, August 8, 2014, 16:38 [IST]
English summary
The Italian super car manufacturer will be getting its latest creation to India the Huracan on 22nd September, 2014. Lamborghini has launched the Huracan globally and it has to fill in the big shoes of its most successful super car till date the Gallardo.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+