లాంబోర్గినీ హారికేన్ టీజర్ వీడియో విడుదల
ఇటాలియన్ సూపర్‌కార్ కంపెనీ లాంబోర్గినీ గడచిన సంవత్సరం డిసెంబర్ నెలలో ఉత్పత్తిని నిలిపివేసిన తమ పాపులర్ గల్లార్డో స్థానాన్ని రీప్లేస్ చేస్తూ వస్తున్న 'హారికేన్' సూపర్‌కారును తొలిసారిగా ఈనెల 4వ తేది నుంచి ప్రారంభం కానున్న 2014 జెనీవా మోటార్ షోలో కంపెనీ అధికారికంగా ఆవిష్కరించనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, లాంబోర్గినీ హారికేన్ ఎల్‌పి 640-4 సూపర్‌కారుకు సంబంధించిన ఓ అఫీషియల్ టీజర్ వీడియోను కంపెనీ విడుదల చేసింది.
లాంబోర్గినీ హారికేన్ ఎల్‌పి 640-4 కారుకు ఆ పేరును 1879 కాలానికి చెందిన స్పానిష్ ఫైటింగ్ బుల్ నుంచి స్ఫూర్తి పొంది పెట్టారు. ఈ పేరులో ఎల్‌పి అంటే, 'లాంగిట్యూడినేల్ పోస్టెరీయోర్' అని అర్థం. ఇది ఇంజన్ ఓరియంటేషన్‌ను ప్రతిభింభింపజేస్తుంది. ఇందులో 610 అంటే ఇంజన్ నుంచి వెలవడే శక్తి (పిఎస్‌లలో), 4 అంటే ఫోర్ వీల్ డ్రైవ్ అని అర్థం.

ఈ కారులో 5.2 లీటర్ వి10 ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8250 ఆర్‌పిఎమ్ వద్ద 610 పిఎస్‌ల శక్తిని, 560 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ లాంబోర్గినీ డోపియా ఫ్రిజియోన్ (ఎల్‌డిఎఫ్) సెవన్-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆప్షనల్ లాంబోర్గినీ డైనమిక్ స్టీరింగ్, మ్యాగ్నెటో-రియోలాజికల్ డ్యాంపర్స్ వంటి ఫీచర్లు ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినవి.
లాంబోర్గినీ హారికేన్‌లో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. అవి - స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా. ఇందులో కోర్సా మోడ్ అత్యంత శక్తివంతమైనది. ఇద కేవలం 3.2 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని, 9.9 సెకండ్ల వ్యవధిలో 0-200 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 325 కిలోమీటర్లు. మార్చ్ 4, 2014వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జెనీవా మోటార్ షోలో లాంబోర్గినీ హారికేన్‌ను విడుదల చేయనున్నారు. ఈ లోపుగా టీజర్ వీడియోను మనం కూడా వీక్షిద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/ZA5zTTlAq-4?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








