2017 నాటికి రోడ్లపై పరుగులు పెట్టనున్న 'యూరస్'

By Ravi

ఇటలీకు చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ సంస్ధ లాంబోర్గినీ తొలిసారిగా అభివృద్ధి చేసిన 'లాంబోర్గినీ యూరస్' (Lamborghini Urus) ఎస్‌యూవీ ఉత్పత్తి దశకు చేరుకునేందుకు మరో మూడేళ్ల సమయం పట్టనుంది. లాంబోర్గినీ తమ యూరస్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను తొలిసారిగా 2012లో చైనాలో జరిగిన బీజింగ్ ఆటో షోలో ఆవిష్కరించింది.

ఉత్పత్తికి సిద్ధంగా ఉండే ఈ పవర్‌ఫుల్, స్టయిలిష్ లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీని 2017 నాటికి రోడ్లపై చూస్తామని లాంబోర్గినీ సీఈఓ స్టీఫెన్ వింకిల్‌మ్యాన్ వెల్లడించారు. అయితే, గతంలో ఒకానొక సందర్భంలో ఆడి సీఈఓ రూపెర్ట్ స్టాడ్లర్ 2016లో ఈ ఎస్‌యూవీని విడుదల చేస్తామని పేర్కొన్నారు. (జర్మన్ లగ్జరీ కార్ కంపెనీకు ఆడికు చెందిన సూపర్‌కార్ బ్రాండే లాంబోర్గినీ).

Lamborghini Urus

సరే అదంతా అటుంచి, లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ విషయానికి వస్తే.. సాలిడ్ బాడీ, స్టన్నింగ్ లుక్, పవర్‌ఫుల్ ఇంజన్‌తో ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ మేకర్ డిజైన్ చేసిన ఈ కాంపాక్ట్ సూపర్ స్టైలిష్ ఎస్‌యూవీలో గరిష్టంగా 600 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా గంటకు 180 మైళ్ల వేగం (అంటే గంటకు 289.68 కి.మీ. వేగం)తో పరుగులు తీస్తుంది.

లాంబోర్గినీ యూరస్ కేవలం 5.4 అడుగుల ఎత్తును, 6.5 అడుగుల వెడల్పును, 16.4 అడుగుల పొడవును కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీని తేలికగా ఉంచేందుకు గానూ దీని తయారీలో కార్బన్ ఫైబర్ రీఫైన్డ్ పాలిమర్‌ను ఉపయోగించారు (అందుకే అంత వేగం). యూరస్ ఎస్‌యూవీని ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌‌తో రూపొందించారు.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/dqvvFJC0cvU?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Saturday, January 25, 2014, 11:41 [IST]
English summary
Lamborghini unveiled the concept Urus in 2012, which gave life to SUV lovers. The purists, however will dislike the thought itself of an Italian supercar diverting attention to the premium SUV segment. The Urus surely knows to strike a pose. It was well accepted by the masses and Italian supercar maker dropped several cues that production was evident. Lamborghini CEO Stephan Winkelmann has confirmed the project.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+