క్రాష్ టెస్టులో అత్యధిక సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న 'డిస్కవరీ స్పోర్ట్'
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్), వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల చేయనున్న ల్యాండ్ రోవర్ డిస్కవర్ స్పోర్ట్ మోడల్ అత్యధిక భద్రతా రేటింగ్‌ను దక్కించుకుంది.
ప్రస్తుతం ల్యాండ్ రోవర్ అందిస్తున్న ఫ్రీల్యాండర్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు వస్తున్న కొత్త డిస్కవరీ స్పోర్ట్, యూరో ఎన్‌సిఏపి (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) క్రాష్ టెస్టులో అత్యధిక సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ కారులో అధునాతన సేఫ్టీ ఫీచర్లను ఉపయోగిస్తున్నారు.
ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ఎస్‌యూవీలో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో రియర్ వ్యూ మిర్రర్‌కి సమీపంలో అమర్చబడిన ఓ డిజిటల్ స్టీరియో కెమెరా, కొల్లైజన్ థ్రెట్‌ను గుర్తించి, ఆటోమేటిక్‌గా బ్రేక్స్ అప్లయ్ అయ్యేలా చేస్తుంది. ఈ థ్రెట్‌కు సంబంధించి ఈ సిస్టమ్ డ్రైవర్‌కు ఆడియో, వీడియో వార్నింగ్ కూడా చేస్తుంది. ఈ కారులోని మరిన్ని సేఫ్టీ ఫీచర్లను తెలుసుకుందాం రండి!

స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు:
- ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)
- డిఎస్‌సి (డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్)
- రోల్ స్టెబిలిటీ కంట్రోల్
- ఎమర్జెన్సీ బ్రేక్ లైట్స్
- ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్
- రివర్స్ ట్రాఫిక్ డిటెక్షన్
- సీట్‌బెల్ట్ రిమైండర్స్
- లేన్ డిపాచ్యుర్ వార్నింగ్
ఆప్షనల్ సేఫ్టీ ఫీచర్లు:
- యాక్టివేట్ స్పీడ్ లిమిటింగ్
- ట్రాఫిక్ సైన్ రికగ్నైజేషన్
- బ్లైండ్‌స్పాట్ మోనిటరింగ్ విత్ క్లోజింగ్ వెహికల్ సెన్సింగ్
- రివర్స్ ట్రాఫిక్ డిటెక్షన్
ఎయిర్‌బ్యాగ్స్:
- డ్రైవర్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్
- థోరాక్స్ (సైడ్) ఎయిర్‌బ్యాగ్స్
- డ్రైవర్ క్నీ (మోకాలి) ఎయిర్‌బ్యాగ్
- సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్


Click it and Unblock the Notifications








