రోల్స్ రాయిస్ కోసం ఒకే కస్టమర్ నుంచి 30 కార్లకు ఆర్డర్
ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన కార్లలో రోల్స్ రాయిస్ కూడా ఒకటి. స్టేటస్ సింబల్‌గా పరిగణించే ఈ కారు ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కోట్ల రూపాయల ఖరీదు చేసే ఈ కారును ఒక్కటి కొనుగోలు చేయాలంటేనే చాలా కష్టం, అలాంటి ఒకే వ్యక్తి ఏకంగా 30 రోల్స్ రాయిస్ లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తే.. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ..! వివరాల్లోకి వెళితే..
లగ్జరీ ఎంటర్‌ప్రెన్యూర్ స్టీఫెన్ హంగ్ రోల్స్ రాయిస్ కార్ల కోసం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఆర్డర్‌ను ప్లేస్ చేశాడు. ఈయన ఏకంగా 30 రోల్స్ రాయిస్ బెస్పోక్ ఎక్స్టెండెడ్ వీల్ బేస్ ఫాంటమ్ కార్లకు ఆర్డర్ ఇచ్చాడు. రోల్స్ రాయిస్‌కు ఇప్పటి వరకు ఏక మొత్తంలో ఇంత పెద్ద ఆర్డర్ రాలేదు. స్టీఫెన్ హంగ్‌కు మకావ్‌లో లూయీస్ 13 అనే లగ్జరీ హోటల్ ఉంది. ఈ హోటల్‌కు వచ్చే అతిథులకు విలాసవంతమైన సౌకర్యాలతో పాటుగా విలాసవంతమైన డ్రైవ్‌ను కూడా ఆఫర్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ కార్లకు ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో మరిన్ని వివరాలను తెలుసుకోండి.

రోల్స్ రాయిస్‌కు ఇప్పటి వరకు ఏక మొత్తంలో ఇంత పెద్ద ఆర్డర్ ఇదే ప్రప్రథమం. ఈ మేరకు రోల్స్ రాయిస్, లూయీస్ 13 హోటల్ యాజమాన్యానికి మధ్య ఓ ఒప్పందం కూడా కుదిరింది. రోల్స్ రాయిస్ సీఈఓ టోర్స్టెన్ ముల్లెర్-ఓటెవోస్, లూయీస్ 13 చైర్మన్ స్టీఫెన్ హంగ్‌లు ఇంగ్లాండ్‌లో గుడ్‌వుడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ డీల్ కుదుర్చుకున్నారు.

మకావ్ ఇప్పటికే పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ మారిపోయింది, విలాసాన్ని ఆస్వాదించడానికి వచ్చే వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. మకావ్‌లో ఉన్న లూయీస్ 13 హోటల్‌ను ఇదిగో ఈ ఫొటోలో చూడొచ్చు.

లూయీస్ 13 హోటల్ కోసం ఆర్డర్ చేసిన ఈ 30 రోల్స్ రాయిస్ కార్లను కూడా ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు.

ఈ 30 కార్లను కూడా చేతుల్తోనే (ఎక్కువ యంత్రాలను ఉపయోగించకుండా) తయారు చేశారు.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ 30 కార్లకు సంబంధించి తాళం చెవులను ఇదిగో ఇలా ఓ ప్రత్యేకమై బాక్సులో అందజేశారు.

ఈ 30 కార్ల తాళం చెవులలో రెండు తాళం చెవులు బంగారు వర్ణంలో ఉంటాయి. తాళం చెవులకు తగినట్లుగానే ఆ రెండు కార్లు కూడా మిగిలిన వాటి కన్నా భిన్నంగా ఉంటాయి.


Click it and Unblock the Notifications