నేడే విడుదల: టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ నేడు (ఆగస్ట్ 12, 2014వ తేదీన) తమ తొలి కాంపాక్ట్ సెడాన్ 'టాటా జెస్ట్' (Tata Zest)ను మార్కెట్లో విడుదల చేయనుంది. ముంబైలో నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో టాటా మోటార్స్ ఈ కారును విడుదల చేయనుంది.
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల, ధరలు, ఫీచర్లు
జెస్ట్ కారుతో టాటా మోటార్స్ తొలిసారిగా కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లోకి ప్రవేశించనుంది. ఈ కారును మొట్టమొదటి సారిగా ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించింది. ప్రస్తుత మాంజాకు రీప్లేస్డ్ వెర్షన్‌గా ఈ కారును ప్రవేశపెడుతారా లేక మాంజాను ఫుల్‌సైజ్ సెడాన్‌గా కొనసాగిస్తూ, ఈ కాంపాక్ట్ సెడాన్‌ను కూడా మాంజాతో పాటే విక్రయిస్తారా అనేది మరికాసేపట్లో తెలియనుంది.

టాటా మోటార్స్ ఇప్పటికే తమ జెస్ట్ సెడాన్ కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. టాటా జెస్ట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్లలో టాటా మోటార్స్ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది.
డీజిల్ వెర్షన్లలో మాత్రం 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా జెస్ట్ ధరలు వేరియంట్‌ను బట్టి ధర రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా. ఈ కారుకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌ను మరికొద్ది సేపట్లో ప్రచురిస్తాం, అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








