హోండా అమేజ్‌తో 'లాంగెస్ట్ డ్రైవ్ థ్రూ అమేజింగ్ ఇండియా'
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్), భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ మొట్టమొదటి కాంపాక్ట్ సెడాన్ 'హోండా అమేజ్' (Honda Amaze) సక్సెస్‌ను సాధించడంతో, ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు గాను, హెచ్‌సిఐఎల్ తమ హోండా అమేజ్‌తో 'లాంగెస్ట్ డ్రైవ్ థ్రూ అమేజింగ్ ఇండియా' పేరిట ఓ ప్రత్యేక రోడ్ ట్రిప్ నిర్వహించనుంది.
ఇందులో భాగంగా, ఈ ఫొటోలో కనిపిస్తున్న డీజిల్ వెర్షన్ హోండా అమేజ్ కారు భారతదేశంలోని 250 నగరాలు/పట్టణాలను కవర్ చేస్తూ మొత్తం 23,000 కిలోమీటర్ల దూరం చుట్టిరానుంది. భారత మార్కెట్లో హోండా అమేజ్ మంచి సక్సెస్‌ను సాధించిందని, తమ అమేజింగ్లీ ఇండియన్ క్యాంపైన్‌లో భాగంగా ఈ లాంగ్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామని, ఈ డ్రైవ్ సమయంలో దేశ వ్యాప్తంగా వివిధ కస్టమర్లను కలుసుకొని, వారి అభిప్రాయాలను సేకరిస్తామని కంపెనీ పేర్కొంది.

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ గడచిన సంవత్సరం ఏప్రిల్ నెలలో హోండా అమేజ్‌ను విడుదల చేసింది. భారత మార్కెట్లో విడులైన కేవలం 16 నెలల్లోనే హోండా అమేజ్ 1,00,000 యూనిట్ల అమ్మకాల రికార్డును సాధించింది. హోండాకు ఇది మొదటి డీజిల్ కారు అలాగే మొదటి కాంపాక్ట్ సెడాన్ కావటంతో దీని అమ్మకాలు జోరందుకున్నాయి. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది.
హోండా అమేజ్‌లో డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ప్రీటెన్షనర్ సీట్ బెల్ట్స్, ధృఢమైన బాడీ నిర్మాణం వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి. అన్ని డీజిల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లలో ఈబిడితో కూడిన ఏబిఎస్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తున్నారు. ఇది ఆరు ఆకర్షనీయమైన రంగులలో, రెండేళ్లు లేదా 40,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








