లీటరు డీజిల్‌పై రూ.7.16 నష్టపోతున్న ఆయిల్ కంపెనీలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు డీజిల్ అమ్మకాలపై నష్టం రూపాయి చొప్పున మిగిలి రూ.7.16కు చేరింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బిపిసి), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పిసి)లు లీటరు డీజిల్‌పై నష్టం ఒక రూపాయి వరకు పూడ్చుకున్నాయి.
చమురు కంపెనీలకు వరుసగా రెండవ పక్షంలో కూడా బాగా కలిసొచ్చింది. మార్చ్ 2014 నెల ఆరంభంలో డీజిల్‌పై నష్టం లీటరుకు రూ.8.37గా ఉంటే, ప్రస్తుతం అది రూపాయి మేర తగ్గి రూ.7.16కు చేరుకుంది. కాగా.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారల్ ధర కూడా 106.18 డాలర్ల నుంచి 105.36 డాలర్లకు తగ్గింది.

దీనికి తోడు ప్రతినెలా డీజిల్‌పై లీటరుకు నెలకు 50 పైసల చొప్పున పెంచుకుంటూ పోతుండటం వలన చమురు కంపెనీలకు డీజిల్ నష్టాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. జనవరి 2013 నుంచి ప్రతి నెల డీజెల్‌పై ప్రభుత్వం నెలకు 50 పైసల చొప్పున పెంచుతున్న సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications








