తెలంగాణాలో మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్
ప్రముఖ దేశీయ యుటిలిటీ, వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తెలంగాణ రాష్ట్రంలో రూ.300 కోట్ల వ్యయంతో ఓ ట్రాక్టర్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. మెదక్ జిల్లాలోని జహీరాబాద్ వద్ద ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కంపెనీ ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రవీణ్ షాతో పాటుగా కొందరు ఉన్నతాధికారుల బృందం తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుతో శనివారం నాడు సమావేశమైనట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: మహీంద్రా ట్రాక్టర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు
ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో ఉన్న మహీంద్రా ప్లాంటుకు సమీపంలోనే ఈ కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ ప్లాంట్ ధృవ్ రేంజ్ ట్రాక్టర్లను తయారు చేయనున్నారు. తెలంగాణా ప్రభుత్వం కూడా మహీంద్రా కొత్త ప్లాంట్ విషయంలో సానుకూలంగా స్పందిస్తోంది. కొత్త రాష్ట్రంలో పెట్టుబడులను ప్రొత్సాహించే విధంగా పన్ను రాయితీలు, పారిశ్రామిక అనుమతులను మంజూరు చేయటంతో పాటుగా ప్లాంట్ ఏర్పాటుకు కావల్సిన పూర్తి మద్దతును అందించేందుకు కూడా కెసీఆర్ సర్కారు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా.. హైదరాబాద్‌లో మెట్రో రైలు నిర్మాణం పూర్తయి, ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తే, ప్రయాణీకులను రైల్వే స్టేషన్లకు తీసుకెళ్ళి, తీసుకురావడానికి సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మహీంద్రా పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలపై రిబేటు ఇవ్వగలిగితే ఈ వాహనాలను రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకువస్తామని మహీంద్రా అధికారులు తెలంగాణా సర్కారుకు తెలిపినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








