డస్టర్, ఈకోస్పోర్ట్‌లకు పోటీగా మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ

By Ravi

ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలకు పోటీగా మహీంద్రా అండ్ మహీంద్రా తమ కొరియన్ భాగస్వామి శాంగ్‌యాంగ్‌తో కలిసి రెండు చిన్న ఎస్‌యూవీలను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు కాంపాక్ట్ ఎస్‌యూవీలను ఎస్101, ఎస్102 అనే కోడ్‌నేమ్‌లతో డెవలప్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: మీ స్కార్పియోను బుల్లెట్ ప్రూఫ్‌‌గా మార్చుకోండి

ఇప్పటికే మహీంద్రా ఎస్101 కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేయబడిన ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ టెస్టింగ్ కూడా చేస్తోంది. ఇది పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువ ఉండి, నేరుగా ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌తో తలపడనుంది. ఇకపోతే ఎస్102 కొంచెం పొడవును కలిగి ఉండి రెనో డస్టర్, నిస్సాన్ టెర్రానోలకు పోటీగా నిలువనుంది.

Quanto

శాంగ్‌యాంగ్‌తో షేర్ చేసుకోనున్న కొత్త మోనోకాక్ ఛాస్సిస్‌పై నిర్మితం కానున్న తొలి మహీంద్రా బ్యాడ్జ్ ఎస్‌యూవీగా ఎస్101 నిలువనుంది. దీని కన్నా కొంచెం పెద్దదిగా ఉండే ఎస్102 కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోనుంది.

మహీంద్రా క్వాంటోలో ఉపయోగించిన 1.5 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌నే ఈ కొత్త ఎస్‌యూవీలోను ఉపయోగించే అవకాశం ఉంది. ఇందులో కొత్త 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను (ప్రస్తుతం ఈ ఇంజన్ అభివృద్ధి దశలో ఉంది) ఇందులో ఓ ఆప్షన్‌గా (ఫోర్డ్ 1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్‌తో కూడిన ఈకోస్పోర్ట్ మాదిరిగా) కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

ఈ కొత్త ఎస్‌యూవీలు విడుదలయ్యా మహీంద్రా క్వాంటో ఎస్‌యూవీని మార్కెట్ నుంచి తొలగించి వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, April 7, 2014, 17:02 [IST]
English summary
Mahindra is said to be developing two new small SUVs along with its Korean subsidiary SsangYong that will rival the Ford EcoSport and Renault Duster respectively. The compact SUVs are known by their codenames S101 and S102 and the former has even been spotted testing wearing camouflage. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+