మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారులో కొత్త వేరియంట్స్
మహీంద్రా గ్రూపుకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విభాగం మహీంద్రా రేవా, భారత విపణిలో విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ కారు రేవా ఈ2ఓలో కంపెనీ కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టనుంది. ఈ ఎలక్ట్రిక్ కారు అమ్మకాలను పెంచుకునేందుకు మహీంద్రా రేవా తమ కస్టమర్ల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్‌ను అనుసరించి ఇందులో కొత్త వేరియంట్లను అప్‌డేట్ చేసింది.
మహీంద్రా ఈ2ఓ ఇకపై మూడు కొత్త వేరియంట్లలో లభ్యం కానుంది. అవి - ఈ2ఓ టిఓ1, ఈ2ఓ టి2 ప్రీమియం, ఈ2ఓ టి2ఓ ప్రీమియం+క్విక్2చార్జ్. ఈ వేరియంట్లలో లభించే ఫీచర్లు ఇలా ఉన్నాయి:

1. మహీంద్రా ఈ2ఓ టిఓ1
ఇది బేస్ వేరియంట్. ఇందులో పవర్ స్టీరింగ్, ఇన్ఫోటైన్‌మెంట్. ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్ వంటి ఫీచర్లు ఉండవు. ఇందులో 14.8 కి.వా. ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 19.8 పిఎస్‌ల శక్తిని, 53.9 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 75 కి.మీ., రేంజ్ 80 కి.మీ.
2. మహీంద్రా ఈ2ఓ టి2 ప్రీమియం
ఇది మిడ్ వేరియంట్. ఇందులో పవర్ స్టీరింగ్, ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్, మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా వంటి ఫీచర్లు లభిస్తాయి. ఈ వేరియంట్‌లో అమర్చిన మోటార్ ఇది గరిష్టంగా 25.47 పిఎస్‌ల శక్తిని, 53.9 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 81 కి.మీ., రేంజ్ 120 కి.మీ.
3. మహీంద్రా ఈ2ఓ టి2ఓ ప్రీమియం+క్విక్2చార్జ్
ఇది టాప్ వేరియంట్. ఇందులో మిడ్ వేరియంట్లో లభించే అన్ని ఫీచర్లతో పాటు, అదనంగా క్విక్2చార్జ్ అనే విశిష్టమైన టెక్నాలజీ ఫీచర్ లభిస్తుంది. దీని సాయంతో బ్యాటరీలు కేవలం 60 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతాయి.


Click it and Unblock the Notifications








