ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా హాలో స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ

By Ravi

యుటిలిటీ వాహనాలను తయారు చేసే మహీంద్రా అండ్ మహీంద్రా, స్పోర్ట్స్ కారును తయారు చేస్తే ఎలా ఉంటుంది..? వినడానికే విచిత్రంగా ఉంది కదూ.. కానీ ఇది నిజం. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా ఓ స్పోర్ట్స్ కారును అభివృద్ధి చేసింది.

'మహీంద్రా హాలో' (Mahindra Halo) పేరిట కంపెనీ తయారు చేసిన ఓ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ కాన్సెప్ట్‌ను ఫిబ్రవరి 5, 2014 నుంచి జరగనున్న 12వ ఎడిషన్ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించనుంది. ఈ కారును మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల విభాగం మహీంద్రా రేవా అభివృద్ధి చేసింది.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, మహీంద్రా హాలో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారులో 105 కి.వా. (140 బిహెచ్‌పి)ల శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించనున్నారు మరియు ఈ ఎలక్ట్రిక్ మోటార్ ఓ హై కెపాసిటీ బ్యాటరీ సాయంతో పనిచేయనుంది. ఇది కేవలం 7 సెకండ్ల కన్నా తక్కువ వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుందట. దీని గరిష్ట వేగం గంటకు 200 కి.మీ. పైమాటే.

Mahindra Reva

అయితే, ఈ మహీంద్రా హాలో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ టూడోర్ వెర్షనా లేక ఫోర్ డోర్ వెర్షనా అనేది ఇంకా తెలియరాలేదు. ఇందులో ఓ పెట్రోల్ ఇంజన్ కూడా ఉండొచ్చనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ పెట్రోల్ ఇంజన్ హాలో స్పోర్ట్స్ కారులో జనరేటర్ మాదిరిగా కానీ లేదా సెకండరీ పవర్ సోర్స్‌గా పనిచేయొచ్చని అంచనా. ఇదే గనుక నిజమైతే, మహీంద్రా హాలో పూర్తి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు కాకుండా, హైబ్రిడ్ స్పోర్ట్స్ కారుగా ఉంటుంది.

మహీంద్రా తమ హాలో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును ఇండియాతో పాటుగా విదేశీయ మార్కెట్లలో కూడా విక్రయించే ఆస్కారం ఉంది. ఈ మోడల్ ఉత్పత్తి 2015 మధ్య భాగం నాటికి కానీ లేదా 2016 తొలినాళ్లలో కానీ జరిగే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు తెలియాలంటే, ఇంకో రెండు రోజల వరకు (ఢిల్లీ ఆటో ఎక్స్‌పో ప్రారంభమయ్యే వరకు) ఆగాల్సిందే.

More from DriveSpark

Article Published On: Monday, February 3, 2014, 14:06 [IST]
English summary
When Mahindra became a part of Formula E electric car championship last year we presumed it would eventually lead to a production sports car. Turns out that sports car is already here even before the start of the championship. Named as ‘Halo' Mahindra's sports car is an electric concept that will debut at the 2014 Auto Expo.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+