స్వచ్ఛ భారత్‌కు మద్ధతుగా అన్ని మహీంద్రా కార్లలో డస్ట్‌బిన్స్!

ప్రస్తుతం దేశమంతటా 'స్వచ్ఛ భారత్' క్యాంపైన్ ఓ ఉద్యమంలా కొనసాగుతున్న సంగతి తెలిసినదే. దేశంలోని ప్రజలు, ప్రముఖులు స్వయంగా ఈ క్యాంపైన్‌లో పాల్గొని పరిశుభ్రమైన భారతదేశాన్ని నిర్మించాలన్న లక్ష్యాన్ని ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసినదే.

ఆటోమొబైల్ యాక్ససరీలపై 75 శాతం తగ్గింపు, త్వరపడండి!

ఈ స్వచ్ఛ భారత్ క్యాంపైన్‌ను సపోర్ట్ చేసేందుకు ఆటోమొబైల్ కంపెనీలు కూడా ముందుకొస్తున్నాయి. దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఈ క్యాంపైన్‌ను వినూత్నరీతిలో సపోర్ట్ చేసింది. కంపెనీ ఇటీవలే మార్కెట్లో ప్రవేశపెట్టిన స్కార్పియో ఎస్‌యూవీలో ఓ ఇన్-కార్ డస్ట్‌బిన్‌ను కంపెనీ పరిచయం చేసింది. కేవలం స్కార్పియోలో మాత్రమే కాకుండా తమ అన్ని ఇతర మహీంద్రా వాహనాల్లోను ఈ క్యాంపైన్‌ను సపోర్ట్ చేసేలా ఇన్-కార్ డస్ట్‌బిన్‌లను ఆఫర్ చేస్తామని కంపెనీ ప్రతిజ్ఞ చేసింది.


సాధారణంగా మన రోడ్ యూజర్లలో అనేక మంది కారులోని చెత్తను రోడ్డుపైనో లేదా పక్కనో పడేస్తుంటడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇకపై కార్ యూజర్లు అలా చేయకుండా, చెత్తను ఈ ఇన్-కార్ డస్ట్‌బిన్‌లో వేసినట్లు రోడ్లను కాస్తయినా శుభ్రంగా ఉంచవచ్చనేది మహీంద్రా అభిప్రాయం. మహీంద్రా కార్లలో ఆఫర్ చేసే ఈ ఇన్-కార్ డస్ట్‌బిన్‌లను కారు సీటుకు లేదా కిటికీ అద్దానికి తగిలించుకోవచ్చు. డస్ట్‌బిన్ నిండిపోయినట్లయితే, అందులోని చెత్తను రోడ్డు పక్కన ఉండే చెత్త కుండీలలో వేయటం చేయాల్సి ఉంటుంది.

ఇక కొత్త మహీంద్రా స్కార్పియో విషయానికి వస్తే.. దీనిని సరికొత్త ఛాస్సిస్‌పై తయారు చేశారు. హైడ్రోఫార్మింగ్ పద్ధతిని ఉపయోగించి ఈ ఛాస్సిస్‌ను తయారు చేశారు, ఫలితంగా ఇది మునుపటి వెర్షన్ ఛాస్సిస్ కన్నా ధృడంగా ఉంటుంది. ఈ కొత్త 2014 మహీంద్రా స్కార్పియో ఎస్2, ఎస్4, ఎస్6, ఎస్6+, ఎస్8 మరియు ఎస్10 అనే ఆరు వేరియంట్లలో లభ్యమవుతుంది.

Scorpio Red

ఇంజన్ విషయానికి వస్తే.. ఇది రెండు విభిన్న ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో ఒకటి 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్, మరొకటి 2.5 లీటర్ ఎమ్ఐ2డిఐసిఆర్ డీజిల్ ఇంజన్. ఇందులోని 2.2 లీటర్, 4-సిలిండర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 120 బిహెచ్‌పిల శక్తిని, 1800-2800 ఆర్‌పిఎమ్ వద్ద 280 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఎస్4, ఎస్6, ఎస్6 ప్లస్, ఎస్8 మరియు ఎస్10 వేరియంట్లలో లభిస్తుంది.

ఇకపోతే బేస్ వేరియంట్ (ఎస్2) మహీంద్రా స్కార్పియోలో 2.5 లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3200 ఆర్‌పిఎమ్ వద్ద 75 బిహెచ్‌పిల శక్తిని, 1400-2200 ఆర్‌పిఎమ్ వద్ద 280 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కేవలం ఎస్2 వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. కంపెనీ ఈ గేర్‌బాక్స్ పనితీరును మరింత మెరుగు పరిచింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త స్కార్పియో లీటరు డీజిల్‌కు 15 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, November 3, 2014, 17:42 [IST]
English summary
Mahindra introduces in-car dustbins in support of ‘Swachh Bharat’ campaign. It is a great initiative that Mahindra has taken part in ‘Swachh Bharat’ campaign.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+