ఆడపిల్లల విద్యను ప్రోత్సహించేందుకు మహీంద్రా క్యాంపైన్

By Ravi

భారతదేశపు అతిపెద్ద యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా, దేశంలో ఆడపిల్లల విద్యను ప్రోత్సహించేందుకు గాను నేడు (ఆగస్ట్ 27, 2014) ఓ కొత్త క్యాంపైన్‌ను ప్రారంభించింది. 'ప్రౌడ్ ఫాథర్స్ ఫర్ డాటర్స్' (Proud Fathers For Daughters) అని పిలువబడే ఈ క్యాంపైన్, భారతదేశంలోని ఆడపిల్లలకు అకాడెమిక్, మెటీరియల్ సపోర్ట్ ఇవ్వటం ద్వారా వారికి విద్యావకాశాన్ని కల్పించడం కోసం ఉద్దేశించబడినది.

'నన్హి కలి' (Nanhi Kali) ప్రాజెక్టుకు ఈ క్యాంపైన్ సోపోర్ట్ ఇస్తుంది. దీనిని కె.సి. మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ మరియు నాంది ఫౌండేషన్ సంస్థల ద్వారా సంయుక్తంగా నిర్వహించబడుతుంది. వీరు ఇప్పటికే భారతదేశంలోని 1,00,000 మంది ఆడపిల్లలను చేరుకున్నారు. మారుమూల గ్రామాలు, గిరిజన మరియు బలహీన ఆర్థిక ప్రాంతాలు కలిగిన దేశంలోని తొమ్మిది రాష్ట్రాలలో ఈ క్యాంపైన్‌ను నిర్వహించనున్నారు.

ఈ క్యాంపైన్‌లో సచిన్ టెండూల్కర్, సారా సచిన్ టెండూల్కర్, అనీల్ కపూర్, సోనమ్ కపూర్, రిషి కపూర్, రిధిమా కపూర్, జావేద్ అక్తర్, జోయా అక్తర్, అలక్యూ పదంసీ మరియు ఆమె కుమార్తెలు రాయెల్, షాజాన్ తదితర సెలబ్రిటీలు కూడా భాగం పంచుకోనున్నారు.

Mahindra Launch Campaign To Support Girl Child Education

భారతదేశంలో సెక్స్ రేషియో అసమతౌల్యంగా ఉంది, ప్రతి 1000 మంది అబ్బాయిలకు 914 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మనదేశంలో ఇప్పటికీ అనేక కుటుంబాలలో అమ్మాయిల జననం కన్నా అబ్బాయిల జననానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి ఆయా కుటుంబాలలోని నిరక్షరాస్యతే అని చెప్పొచ్చు.

మంచి భవిష్యత్తు కోసం భారతీయ సమాజంలో స్త్రీలకు విద్య ఎంత అవసరమో అనే విషయాన్ని ఈ క్యాంపైన్ ద్వారా తెలియజేయనున్నారు. ఈ క్యాంపైన్‌లో భాగంగా మారుమూల ప్రాంతాలను సందర్శించి అక్కడి తల్లిదండ్రులు, ప్రాంతీయులలో ఆడపిల్లల చదువుకోవాల్సిన అవసరం వారిలో అవగాహన కల్పించనున్నారు.

'నన్హి కాలి' ప్రాజెక్టుకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 27, 2014, 14:44 [IST]
English summary
India's largest manufacturer of Utility Vehicles Mahindra will be launching a new campaign on 27th August, 2014. The campaign is called 'Proud Fathers For Daughters'. It is aimed at providing education to the girl child in India by providing academic and material support.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+